తిరుమలలో(TTD) ఇటీవల కొనసాగిన భారీ రద్దీతో పోలిస్తే ప్రస్తుతం భక్తుల సంఖ్య కొంత తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం పొందేందుకు సుమారు ఆరు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Read also: Tirumala: లగేజీ తరహాలో పాదరక్షల కౌంటర్లు
సర్వదర్శనానికి 6 గంటల సమయం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే(TTD) భక్తులు వేచి ఉండటం వల్ల రద్దీ నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న తిరుమలలో మొత్తం 73,014 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: