📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

TTD: తిరుమల పవిత్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Author Icon By Rajitha
Updated: February 9, 2026 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి: కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామి నిలయమైన తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తిరుమల పవిత్రతకే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు. తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి ఘటనపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఒక జీఓ తీసుకువచ్చారని, దాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపవిత్రం జరిగితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Read also: Nitin Gadkari: విజయవాడ బైపాస్‌లో అక్కడి వరకు వాహనాలకు పర్మిషన్..

The coalition government is committed to preserving the sanctity of Tirumala.

తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో “బీజేపీ కమలవికాసం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకులు దయాకర్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, కోలా ఆనంద్, అశోక్ రాజు, పంతుల సురేష్, నిషిధరాజు, భాను ప్రకాశ్ రెడ్డి, జల్లి మధుసూదన్, వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై నాయకులు ప్రసంగించారు.

కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని

కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఉండేవి కాదని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో బీజేపీయే ప్రధానమని, ఆ తర్వాతే టీడీపీ, జనసేన పార్టీలని స్పష్టంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకులకు తగిన అవకాశాలు కల్పించాలని సూచించారు. కూటమిలో అన్ని పార్టీలకు సముచిత గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం, ప్రభుత్వ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని, అన్ని కులాలకు న్యాయం జరగాలని ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Adi Narayana Reddy comments BJP alliance government BJP Kamala Vikasam meet P V N Madhav statement tirumala laddu controversy Tirumala sanctity YSRCP Criticism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.