📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD: బోర్డు, కొనుగోళ్ల కమిటీయే కీలకం.. వారు చెప్పిందే చేశానన్న ధర్మారెడ్డి

Author Icon By Rajitha
Updated: November 14, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల లడ్డూల తయారీకి కల్తీనెయ్యి సరఫరా, దాన్ని వినియోగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో సిబిఐ సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో రెండు రోజులపాటు మాజీ టిటిడి (TTD) ఇఒ, అదనపు ఇఒ ఎవి ధర్మారెడ్డిని పలుకోణాల్లో విచారణ చేశారు. సిట్ అధికారుల విచారణలో తనకు తెలిసిందే చెప్పానని, 2020 నుండి 2024 మేనెల వరకు సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్లు విషయంపై ఎలాంటి అంశాలు చోటు చేసుకున్నాయనేది తన సరిధిలో ఉన్నదే చెప్పానని ధర్మారెడ్డి మీడియాకు వెల్లడించిన విషయం విదితమే. తనకు తన కుటుంబసభ్యులకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల అత్యంత భక్తి విశ్వాసాలున్నాయని, దేవుని చెంత భక్తితో విధులు నిర్వర్తించానని ఆయన తెలిపారు. తన పాలనలో ఎలాంటి తప్పు చేయలేదని, టిటిడి బోర్డు, కొనుగోళ్ల కమిటీ సభ్యులు చేసిన నిర్ణయాలు, ఆమోదించడం చివరగా ఇఒ వరకు చేరుతుందన్నారు.

Read also: AP: ఇవాళ నిర్వహించే ఎగ్జామ్ వాయిదా

TTD: బోర్డు, కొనుగోళ్ల కమిటీయే కీలకం.. వారు చెప్పిందే చేశానన్న ధర్మారెడ్డి

అంతేగానీ బోర్డు నిర్ణయాలను కాదని అధికారులు చేసేదేమీ ఉండదనేది ఆయన మనసులో మాట సిట్ కు వివరించినట్లు తెలిసింది. కల్తీనెయ్యి బాగోతంలో విచారణకు రెండు రోజులు హాజరైన మాజీ ఇఒ ఎవి ధర్మారెడ్డి కీలక విషయాలను సిట్ కు వెల్లడించారనేది సమాచారం. సిట్ అధికారుల విచారణ ముగించుకున్న ఆయన ఆ తరువాత కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి విషయంపై సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇచ్చానని, విచారణకు సహకరించానని తెలిపారు. గతంలో టిటిడిలో బాధ్యతలు నిర్వహించిన అధికారులను ప్రశ్నించడంలో భాగంగానే తనను కూడా విచారణ చేశారన్నారు. విచారణకు సంబంధించిన కొన్ని అవాస్తవాలతో భక్తులను పక్కదారి పట్టించ వద్దని, భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని కోరారు.

అన్ని రికార్డులు చట్టబద్దమేనని

2020 నుండి 2024 వరకు కల్తీనెయ్యి సరఫరా చేయడం, అదేనెయ్యిని పోటులో వినియోగించారనే కేసులో సిబిఐ సిట్ అధికారుల దర్యాప్తులో అడిగిన అన్ని విషయాలకు తన వద్ద ఉన్న సమాధానాలు తెలిపారనేది తెలుస్తోంది. కల్తీనెయ్యి బాగోతంలో తన ప్రమేయం ఏమీ లేదని, ఇఒగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని సిట్ డిఐజి మురళీరాంభా, తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు మాజీ ఇఒ ఎవి ధర్మారెడ్డి విచారణలో తెలిపినట్లు తెలుస్తోంది. తన పాలనలో శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని మరింతగా చాటి చెప్పడానికి అన్ని నిర్ణయాలు బాధ్యతాయుతంగా తీసుకున్నామని, అన్ని రికార్డులు చట్టబద్దమేనని, అవన్నీ భద్రంగానే ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించినట్లు తెలిసింది. టెండర్ నియమాల్లో అన్నీ నియమాలను పాటించానని తెలిపారు. అయితే కల్తీనెయ్యి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న గత ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ ఎదుట హాజరై నోరు విప్పితే ఎలాంటి పరిణామాలు జరగబోతాయో అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా

కల్తీనెయ్యి విషయంలో 2020-24వరకు ఏం జరిగిందనేది మాజీ ఇఒ సమగ్రంగా ఆధారాలతో సిట్ కు వాంగ్మూలం ఇచ్చారనేది సమాచారం. అప్పటి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి, పోద్బలం వల్లే ఇవన్నీ జరిగినట్లు సిట్ కు వెల్లడించడం హాట్ టాఫిక్ మారింది. ఇంకా అవసరమైన సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. టిటిడికి కల్తీనెయ్యి సరఫరా బాగోతం పూర్తిగా తేల్చే పనిలో సిట్ వేగవంతమైన విచారణ చేస్తున్నారు. అదేగాక ఇదే కేసులో కల్తీనెయ్యి సరఫరాలో కీలక నిందితుడు, బోలే బాబాడెయిరీ మేనేజర్ కరీముల్ల కోసం సిట్ బృందాలు వేట మొదలుపెట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శ్రీకాళహస్తి, చెన్నైలో నీట్ అధికారులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. ఈ కేసులో అపూర్వ చావడ అల్లుడు ఏ5గా ఉన్నాడు.

తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి సరఫరా అయిన, వినియోగించిన కల్తీనెయ్యి కుట్రలో కీలకం ఎవరనేది ఇప్పుడు సిట్ అధికారుల విచారణలో వెల్లడి కావాల్సిన సమాచారం. ఇదిలా ఉండగా టిటిడిలో జరిగిన తప్పిదాలు, ఆక్రమాలపై ఓ వైపు సిబిఐ సిట్ అధికారులు మరోవైపు సిఐడి అధికారులు పలుకోణాల్లో రాజకీయాలకతీతంగా దర్యాప్తు చేస్తున్న ఈ సమయంలో రాజకీయ హడావిడి తిరుపతిలోనేగాక రాష్ట్ర రాజధానిలో కూడా ఎక్కువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం తిరుపతిలో టిడిని నేతలు విచారణ కార్యాలయాల వద్దకు వెళ్ళి పలువురి పేర్లను సూచిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని విజప్తి చేయడం ఎంతవరకు సమంజసమనేది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ వాయిదా:

కల్తీనెయ్యి సరఫరా కేసులో అత్యంత కీలకమైన సూత్రదారిలో భాగస్వామిగా సిట్ గుర్తించిన మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్ ఈనెల 17వతేదీకి వాయిదా పడింది. నెల్లూరు ఏసిబి కోర్టులో విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎదుట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. చిన్నఆప్పన్నను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే 17 వతేదీకి వాయిదా వేయడంతో కస్టడీకి ఇస్తారా లేక బెయిల్ పిటిషన్ పై నిర్ణయం వెలువడిస్తారా అనేది చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CBI SIT Dharamareddy Ghee Scam latest news Telugu News TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.