విజయవాడ : పరకామణి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం ముందుకెళ్లాలని ఎసిబి డిజి, సిఐడి అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టిటిడి, పోలీసు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. టిటిడి (TTD) పరకామణి కేసు విచారణ సందర్భంగా గురువారం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ కుమ్మక్కై పరకామణి కేసును.. టిటిడి, పోలీసులు బలహీన పరిచారని పేర్కొంది. నిందితుడు రవి కుమార్ తో పాటు అతడి కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని.. సిఐడి, ఎసిబి నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతుందని తెలిపింది.
Read also: TTD Jobs: టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్
Take action against those responsible in the Parakamani case
నిందితుడు రవికుమార్ ఆస్తులు స్వీకరించే క్రమంలో టిటిడి అధికారులు, బోర్డు సభ్యులు, పోలీసులు చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక మాజీ ఎవిఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సిఐడి అధికారులను ఆదేశించింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్ట్ దాఖలు వరకూ దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పరకామణిలో సంస్కరణలపై టిటిడి సమర్పించిన నివేదికపై హైకోర్టు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యుత్తమ ఆలోచనలతో రావాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. తిరుమల శ్రీవారి పరకామణిలో చేపట్టాల్సిన సంస్కరణలపై నివేదికను ఇటీవల హైకోర్టుకు టిటిడి సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు గురువారంపై విధంగా స్పందించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: