📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : TTD – డిగ్రీ ఉన్నవారికే శ్రీవారిసేవ!

Author Icon By Shravan
Updated: September 4, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల TTD : ధార్మికసంస్థ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు ఇతోదిక సేవలం దిస్తున్న శ్రీవారిసేవకులు మరింత మెరుగైన సేవలందించే దిశగా శిక్షణ ఇస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారిసేవ చేయాలనుకునే వారికి కనీసం డిగ్రీ విద్యార్హతగా (Degree qualification) నిర్ణయించామని, వారికి తిరుమలలో మూడ రోజులు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఒకరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలమేరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి, బర్డ్, ఆయుర్వేద ఆస్పత్రుల్లో వైద్యసేవలకు వాలంటరీ సర్వీసెస్ను అమలు చేయనున్నట్లు చైర్మన్ నాయుడు వెల్లడించారు. బుధవారం సాయంత్రం తిరుమల అన్నమయ్యభవనంలో టిటిడి ఇఒశ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎసీ మురళీకృష్ణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారిసేవ ప్రారంభించి 25 సంవత్సరాలు కావస్తోందన్నారు. దాదాపు 17లక్షలమంది శ్రీవారి సేవకులు స్వచ్చందంగా శ్రీవారిసేవలో పాల్గొన్నారన్నారు. రోజుకు 3,500మంది వరకు సేవకులు సేవలందిస్తున్నారని తెలిపారు.

భక్తులకు మెరుగైన సేవలు, ఆహార సదుపాయాలు

ప్రతిరోజూ శ్రీవారి దర్శనార్థం లక్షమంది వరకు భక్తులు వస్తున్నారని, వారికి అన్నిచోట్ల ఇతోధిక సేవలందించేందుకు శ్రీవారిసేవకులు సేవలందిస్తున్నారన్నారు. భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా సేవలకు శిక్షణనివ్వాలని నిర్ణయించామన్నారు. తిరుమలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించేందుకు క్యాంటీన్ల నిర్వహణ బ్రాండెడ్ హోటళ్లకు అప్పగించడం జరిగిందన్నారు. ఆదాయం ముఖ్యంకాదని, భక్తులకు సరసమైన ధరలకు ఆహారం అందించాలనే ధరల నియంత్రణ చేశామన్నారు. కొందరు పనిగట్టుకుని టెండర్లపై ఆరోపణలు చేస్తున్నారని, అలాంటివేమీ పట్టించుకోమన్నారు. కొన్ని నియమనిబంధనలు పెట్టామని, ప్రణాళికా బద్దంగా టెండర్లు పిలిచామన్నారు. టెండర్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేశామన్నారు.

TTD – డిగ్రీ ఉన్నవారికే శ్రీవారిసేవ!

క్యాంటీన్ల టెండర్లు, లడ్డూల నాణ్యత

టిటిడి ఇఒ జె. శ్యామలరావు మాట్లాడుతూ భక్తులకు తిరుమలలో మరింత రుచికరమైన, నాణ్యమైన పరిశుభ్ర ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోని ప్రముఖ ఆహార పదార్థాల తయారీ సంస్థలు టెండర్లలో పాల్గోనే అవకాశాన్ని టిటిడి కల్పించిందన్నారు. ఆన్లైన్లో ప్రముఖ సంస్థల నుండి టెండర్లు ఆహ్వానించడం ద్వారా బిగ్ క్యాంటీన్లను కేటాయించడం జరిగిందన్నారు. జనతా క్యాంటీన్లకు ముందుగానే లైసెన్స్ రుసుం నిర్ణయించి లాటరీ విధానంలో ఇఒఐ బిడ్డింగ్ ప్రక్రియద్వారా జనతా క్యాంటీన్లను కేటాయించడం జరిగిందని ఇఒ తెలిపారు. టిటిడి నిబంధనల మేరకు దరఖాస్తులను పదిసంస్థలకు కేటాయించడం జరిగిందన్నారు. టిటిడి అదనపు ఇఒ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి (Lord) అన్నప్రసాదాల నాణ్యత పెరగడంతో లక్షమందికి పైగా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారన్నారు. లడ్డూల ముడిపదార్థాలు నాణ్యతగా ఉన్నవి, నాణ్యత నెయ్యి వినియోగించడం వల్ల లడ్డూలు రుచికరంగా విథరణ చేస్తున్నామన్నారు. రోజుకు 4లక్షలు లడ్డూలు తయారవుతుంటే 4లక్షలు అమ్ముడవుతున్నాయని, లడ్డూలు భక్తులు కొనుగోలు చేస్తున్నారన్నారు. క్యాంటీన్ల టెండర్ల విషయంలో ఇప్పటివరకు ఒక పాలసీ విధానం లేకపోవడం వల్ల కొన్ని తప్పులు జరిగాయన్నారు. ధరల నియంత్రణతో బాటు నాణ్యత ముఖ్యమన్నారు.

శ్రీవారిసేవకులకు కొత్త శిక్షణా కార్యక్రమం ఎందుకు ప్రారంభించారు?
భక్తులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు శ్రీవారిసేవకులకు మూడు రోజుల శిక్షణ ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది.

తిరుమలలో ఆహార నాణ్యతను ఎలా మెరుగుపరిచారు?
క్యాంటీన్ల నిర్వహణ బ్రాండెడ్ హోటళ్లకు అప్పగించి, ధరల నియంత్రణతో పాటు నాణ్యతను ప్రాముఖ్యతనిస్తూ టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/uk-energy-drinks-ban-proposal-for-children-under-16/international/540969/

Andhra Pradesh Breaking News in Telugu Devotees Education Requirement Religious News Srivari Seva Telugu News Paper Telugu News Today Temple Rules Temple Services tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.