తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఏపీ టూరిజం, టీటీడీ శుభవార్త చెప్పాయి. తిరుమలతో పాటు తిరుపతి, చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ ఆలయాలను సులభంగా దర్శించుకునేలా తక్కువ ఖర్చుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ప్యాకేజీల ద్వారా భక్తులకు నిర్దిష్ట దర్శన సమయాలు కల్పించడంతో పాటు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఆలయాల ప్రాముఖ్యత, చరిత్రను వివరించేందుకు గైడ్ కూడా ఉంటారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇబ్బంది లేకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తారు. కోరిన ప్రాంతం నుంచే సేవలు అందేలా సౌకర్యం కల్పించారు. ఈ టూర్ ప్యాకేజీలు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
Read also: Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్
Special tours for devotees visiting Tirupati
తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన కోసం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఈ ప్యాకేజీ టికెట్ ధరను రూ.250గా నిర్ణయించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, వకుళామాత ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం వంటి ప్రముఖ క్షేత్రాలను ఈ టూర్‌లో దర్శించుకోవచ్చు. అలాగే శ్రీనివాసమంగాపురం, తొండవాడ వంటి ప్రాంతాల్లోని ఆలయాలు కూడా ఉన్నాయి. భక్తులు తక్కువ సమయంలో ఎక్కువ ఆలయాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
తిరుపతికి (Tirumala) వచ్చిన భక్తులు ఎక్కువగా శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే ఈ ఆలయాల కోసం కూడా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. శ్రీకాళహస్తి టూర్‌కు రూ.450, కాణిపాకానికి రూ.550గా టికెట్ ధరను ఫిక్స్ చేశారు. ఏసీ బస్సుల్లో కాణిపాకం, తిరువణ్ణామలై, వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనానికి రూ.1200గా నిర్ణయించారు. ఈ బస్సులు తిరుపతిలో ఉదయం 9 గంటలకు బయలుదేరతాయి. శ్రీనివాసం, విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయాల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం పర్యాటకశాఖ కార్యాలయాలను లేదా ఇచ్చిన నంబర్లను సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: