📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

TTD: నూతన సంవత్సరానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు

Author Icon By Tejaswini Y
Updated: December 27, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో వరుస సెలవుల నేపథ్యంలో రద్దీ తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ(TTD) భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠద్వార దర్శనాల(Vaikuntha Dwaram Darshan) కోసం పూర్తి సదుపాయాలను సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని టీటీడీ అంచనా వేసింది.

Read Also: Shivraj Singh Chauhan: అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

టీటీడీ నిర్వహిస్తున్న 10 రోజుల వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ(tirumala tirupathi devasthanams) ఈవో అనిల్‌కుమార్ సింఘాల్(Anil Kumar Singhal) సూచనలు చేశారు. ఈ పది రోజులలో ఏ రోజైనా భక్తులు స్వామివారిని దర్శించుకుంటే సమాన ప్రతిఫలం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రారంభ మూడు రోజుల దర్శనాల కోసం దేశవ్యాప్తంగా 1,89,000 మంది భక్తులకు టోకెన్లు జారీ చేయడం పూర్తయిందని సింఘాల్ తెలిపారు. భక్తులు కేటాయించిన సమయంలో తిరుమలకు చేరుకుంటే రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో మూడు ప్రవేశమార్గాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.

TTD: Special darshan arrangements for the New Year

తిరుమలలో 7,70,000 భక్తులకు దర్శనం..

నిర్దేశిత సమయానికి వచ్చిన భక్తులు క్యూలైన్‌కు దగ్గరగా ఉన్న ప్రవేశమార్గం ద్వారా లోపలికి ప్రవేశిస్తారని, సమయానికి ముందుగా వచ్చినవారిని ఇతర ప్రవేశమార్గాల ద్వారా క్యూలైన్‌లోకి పంపి సరిగ్గా కేటాయించిన సమయంలోనే దర్శనం పొందేలా ఏర్పాట్లు చేయబడినట్లు చెప్పారు. 29వ తేదీన పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయబడి, ఆ రోజు మాత్రమే దర్శనాలు పూర్తవుతాయని సింఘాల్ పేర్కొన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి పది రోజుల్లో 7,70,000 మంది భక్తులకు దర్శనం కల్పించబడనుందని తెలిపారు.

ప్రివిలేజ్, బ్రేక్ దర్శనాలను రద్దు చేసి, ప్రముఖులు మాత్రమే నేరుగా దర్శనం పొందేలా ఏర్పాటు చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 వరకు నిరంతర అన్నప్రసాదాలు అందుబాటులో ఉంటాయని, 16 రకాల అన్నప్రసాదాలు, పానీయాలు సిద్ధం చేయబడిందని చెప్పారు. భద్రత కోసం పోలీస్ విభాగం నుండి 2,400 మంది, టీటీడీ విజిలెన్స్ నుండి 1,100 మంది సిబ్బందిని నియమించారని, ఆరు లక్షల మంది శ్రీవారి సేవకుల సాయంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం పొందగలుగుతారని ఈవో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anil Kumar Singhal New Year Darshan tirumala Tirupati Temple TTD TTD EO Instructions Vaikuntha Dwaram Darshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.