📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: TTD: వచ్చే బ్రహ్మోత్సవాలకు మాడవీధుల్లోని గ్యాలరీలకు పైకప్పు!

Author Icon By Rajitha
Updated: October 4, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల Tirupati : దేశం నలుమూలల నుండి తిరుమలకు వస్తున్న భక్తులు ఇచ్చే విలువైన అభిప్రాయాలు, సూచనలతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఇఒ అనిల్కుమార్సింఘాల్ తెలిపారు. భక్తులు సలహాలతో ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కొన్ని అమలుచేస్తామన్నారు. భక్తుల అభిప్రాయాలతోనే టిటిడి TTD తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. దేవదేవుని ఆశీస్సులు, భక్తుల ఆశీర్వాదాలతోనే టిటిడి ఇఒగా రెండవసారి రావడం తనపై సిఎం చంద్రబాబు మరింత బాధ్యతలు గుర్తుచేశారన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్యభవనంలో ‘డయల్ యువర్ ఇఒ” కార్యక్రమం జరిగింది.

AP: ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం – 2.90 లక్షల మందికి లబ్ధి

TTD

అనంతరం ఇఒ సింఘాల్ మీడియాప్రతినిధులతో మాట్లాడారు. ఈ వారం 23 మంది భక్తులు తమతమ అమూల్యమైన సూచనలు, సలహాలు చేశారన్నారు. ఇందులో ఆలయ మాఢవీదుల్లోని గ్యాలరీలకు పైకప్పు(షెల్టర్) ఏర్పాటుచేస్తే వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బంది ఉండదని సూచించారన్నారు. దీనిపై ఆగమపండితులతో, బోర్డుతో చర్చించి అవకాశం ఉన్నవరకు వచ్చే బ్రహ్మోత్సవాలకు ఈ పనులు చేపడతామన్నారు, అంగప్రదక్షణటోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడంలో లక్కీడిప్లో కేటాయించడం మంచిదికాదని, దీన్ని అంగప్రదక్షిణటోకెన్లు విడుదలపై బోర్డులో చర్చించి మార్పుచేయాలని భక్తులు కోరారన్నారు. ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన విధంగా నిర్ణ యం తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు. సౌకర్యాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఆన్లైన్ లక్కీ డిప్లో బల్క్ బుకింగ్స్ లో అవక తవకలు జరిగాయంటూ భక్తుల నుండి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉంద న్నారు.

భక్తుల సూచనలు, సలహాలను టిటిడి బోర్డు దృష్టికి తీసుకెళ్ళి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్స వాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. హైదరాబాద్నుండి శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ నవంబర్ 14 నుండి 16వతేదీ వరకు. పరకామణి సేవ బుక్ సుకున్నామని, 14వతేదీ రిపోర్టుచేయాలని ఉందన్నారు. దీనిపై ఇఒ సింఘాల్ సమాధానంగా సాఫ్ట్వేర్లో మార్పులుచేశామని, 13వతేదీనే రిపోర్టుచేయాలని తెలిపారు. తిరువూర్నుండి నాగేశ్వరరావు మాట్లాడుతూ వెండివాకిలినుండి బంగారువాకిలి వరకు భక్తుల మధ్య తోపులాట ఎక్కువగా ఉందని, అక్కడ విదుల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది, శ్రీవారిసేవకులు, టిటిడి సిబ్బంది భక్తులపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇఒ ఆ ప్రాంతంలో భక్తుల పట్ల వ్యవహరించాల్సిన విధానంపై శిక్షణనిస్తున్నామన్నారు.

20గంటలపైగా

స్వామివారి దర్శనానికి 20గంటలపైగా పడుతోంది, కావున భక్తులు నిమిషంపాటు స్వామివారిని చూడాలనుకుంటున్నారు. క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ నుండి సుబ్బలక్ష్మి, అరుంధతి మాట్లాడుతూ వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలోనే ప్రతిరోజూ కేటాయించే విధంగా దర్శన టోకెన్లు విధానం మార్చాలని, ఆన్లైన్లో మూడునెలల ముందుగాకుండా 15రోజుల ముందు విడుదల చేయాలని కోరారు. ఇందుకు ఇఒ సింఘాల్ స్పందిస్తూ వీలైనంతవరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మీడియా సమావేశంలో టిటిడి సివిఎస్టి మురళీకృష్ణ, సీఐ సత్యనారాయణ, సిపిఆరా డాక్టర్ తలారి రవి, పిఆర్ నీలిమ, డిప్యూటీ ఇఒలు భాస్కర్, రాజేంద్రకుమార్, సోమన్నారాయణ, డిఎఫ్ ఒ ఫణికుమార్ నాయుడు తదితరులు పాల్గోన్నారు.

భక్తులు సూచించిన మాడవీధి గ్యాలరీల సమస్య ఏమిటి?
వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే గ్యాలరీలకు పైకప్పులు (షెల్టర్లు) ఏర్పాటు చేయాలని సూచించారు.

టిటిడి ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్ దీనిపై ఏమని తెలిపారు?
ఆగమపండితులు, బోర్డుతో చర్చించి అవకాశం ఉంటే వచ్చే బ్రహ్మోత్సవాలకు ఈ పనులు చేపడతామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anil Kumar Singhal Brahmotsavams Breaking News devotees suggestions latest news Madaveedhi galleries Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.