📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: TTD: సినీఫక్కీలో గంజాయి పట్టివేత: ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు

Author Icon By Sushmitha
Updated: November 11, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి (చంద్రగిరి): తిరుపతి(TTD) జిల్లాలో చంద్రగిరి పోలీసులు తమ సమర్థత, చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ 32 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు(SP L. Subbaraidu) ఈ పట్టివేతలో కృషి చేసిన అధికారులను అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు. పనపాకం పంచాయతీ, తువ్వచేనుపల్లి జాతీయ రహదారి వద్ద ప్రత్యేక తనిఖీల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 Read also: Vijayawada: యాభై కిలోమీటర్లకో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వ కార్యాచరణ

TTD

డాగ్‌స్క్వాడ్‌తో రహస్య అరల గుర్తింపు

తమిళనాడుకు చెందిన పొన్నుస్వామి సెల్వరాజ్(Ponnuswamy Selvaraj) (43) ఒరిస్సా నుంచి గంజాయిని తన కారులో అత్యంత పకడ్బందీగా దాచుకుని తరలిస్తున్నాడు. పోలీసుల(police) సాధారణ తనిఖీలో ఈ గంజాయి బయటపడలేదు. అయితే, తమకు లభించిన విశ్వసనీయ సమాచారంతో సంతృప్తి చెందని పోలీసులు, మరోమారు పోలీస్ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. ఈ క్రమంలో, కారు డాష్ బోర్డ్, గేర్‌బాక్స్, టైర్ స్టెప్ భాగాలలో దాచిపెట్టిన గంజాయిని జాగిలం కనిపెట్టింది. తనిఖీ చేయగా, 32.730 కిలోల (27 ప్యాకెట్లు) గంజాయి బయటపడింది.

నిందితుల అరెస్ట్, ఎస్పీ హెచ్చరిక

కారు నడుపుతున్న పొన్నుస్వామి సెల్వరాజ్‌తో పాటు, శివగంగై జిల్లాకు చెందిన కలనివాసల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, గంజాయితో పాటు 2 మొబైల్స్‌ను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, వినియోగం, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాలకు మత్తు పదార్థాల సరఫరాకు పాల్పడితే తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

Chandragiri Police Drug bust ganja smuggling Google News in Telugu Latest News in Telugu police dog squad. Telugu News Today Tirupati district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.