తిరుమల : ధార్మికసంస్థ తిరుమల తిరుపతిదేవస్థానం పరిధిలోని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడేళ్ళ క్రిందట ఆలయ విమానగోపురం బంగారుతాపడం పనుల్లో భారీగా 50కిలోల వరకు బంగారం మాయమైన ఉదంతంపై తాజాగా టిటిడి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. 2020లోనే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తుల కిరీటం దొంగతనం జరగడం, ఆ ఉదంతంలో మహారాష్ట్ర భక్తుడు పట్టుబడటం తెలిసిందే. అప్పట్లోనే ఈ వరుస ఆరోపణలతో బంగారు మాయమైందనే ఘటన వెలుగుచూసింది. ఆ తరువాత రెండేళ్ళకు ఆలయంలో బంగారుతాపడం పనులు చేపట్టినా అప్పటికే బంగారుమాయంపై అప్పట్లో టిటిడి (TTD) పాలకమండలి పెద్దలు, టిటిడి అధికారులు ఈ ఘటనపై నామమాత్రంగా విచారణ చేపట్టి మిన్నకుండిపోయారు.
Read also: Online Shopping: ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ
తిరుమల తిరుపతిదేవస్థానం
బంగారు మాయంపై వాస్తవాలు
గతంలోనే ఈ ఆరోపణల్ని అప్పటి టిటిడి అధికారులు కొట్టివేశారు. దీంతో ఆలయంలో బంగారు మాయంపై ఉద్యోగసంఘాలు అనుమానం వ్యక్తం చేసినా ఎవరికివారే సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా టిటిడిలో గత అవినీతి అక్రమాలపై టిటిడి పాలకమండలి దర్యాప్తు జరిపిస్తున్న సమయంలో గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు మాయంపై వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనే నిగ్గుతేల్చేందుకు టిటిడి పాలకమండలి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 2022-2023 మధ్యకాలంలో గోవిందరాజస్వామి ఆలయ విమానగోపురానికి బంగారుతాపడం పనులు చేసేందుకు టిటిడి వందకిలోల బంగారం కేటాయించింది.
దాదాపు సగం బంగారం మాయమైందని
తొలుత ఈ బంగారాన్ని ఆలయానికి వెనుకవైపు ఉన్న పాత హుజూర్ఆఫీస్ బంగారుఖజానా (ట్రెజరీ)లో భద్రపరిచారు. అక్కడ పొరలుగా(లేయర్లుగా )బంగారు తాపడం చేయాల్సి ఉంది. ఇందుకు తొమ్మిదిపొరాలుతో తాపడం పనులు చేపట్టాలి. అయితే అప్పట్లోనే ఈ కాంట్రాక్టర్, కార్మికులు రెండు పొరలతో బంగారుతాపడం చేసేసి చేతులు దులుపేసుకున్నారు. దీనిపై దాదాపు సగం బంగారం మాయమైందని అప్పట్లోనే బలమైన ఆరోపణలు ఉద్యోగులు వ్యక్తం చేశారు. కానీ విచారణ మాత్రం జరగలేదు. సబ్జుకు పనులు చేపట్టేలా అప్పటి ఆలయ అధికారులు చూశారనేది టిటిడి విజిలెన్స్ తిరుపతి విభాగం విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఉద్యోగుల నుండి అందిన ఫిర్యాదులపై దృష్టి పెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: