📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: TTD: కల్తీనెయ్యిలో వేగంగా సాగుతున్న దర్యాప్తు!

Author Icon By Rajitha
Updated: November 18, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుపతి : తిరుమల లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరా జరిగిన కీలక పరిణామంలో సూత్రధారుల పాత్ర తేల్చేందుకు సిబిఐ సిట్ అధికారులు దర్యాప్తు వేగంగా సాగిస్తున్నారు. ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సిట్ బృందం రిమాండ్ రిపోర్టుల్లోని ఆధారాల మేరకు మరింత వేగంగా ముందుకు అసలు కదులుతున్నారు. 2020-2024 మధ్యకాలంలో తిరుమలకు ఆవు నెయ్యికి బదులు కల్తీనెయ్యి సరఫరా చేయడంలో పలు డెయిరీలకు సామర్థ్యం లేకున్నా… అసలు పాలు సేకరణ, ఆపై వెన్నతీసి నెయ్యి తయారుచేయడం వంటి యంత్రాలు లేకున్నా టిటిడికి (TTD) నెయ్యిని మాత్రం సరఫరాచేయడం పెద్ద సంచలనం కలిగించింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో సూత్రధారులను పట్టుకునే ప్రయత్నంలో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్నను నెల్లూరు జైలు నుండి ఐదురోజుల కస్టడీకి సోమవారం తీసుకున్నారు.

Read also: Satya Kumar: గిరిజనులు సంస్కృతికి వారసులు

Investigation into adulterated oil is progressing rapidly

నెల్లూరు జైలు నుండి తీసుకువచ్చిన అతనిని ముందుగా సోమవారం ఉదయం తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఆయనను తిరుపతిలోని సిట్ తాత్కాలిక కార్యాలయంకు తీసుకువచ్చి లోతైన విచారణ మొదలుపెట్టారు. ఈ ఐదురోజులు పాటు విచారణలో గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న డెయిరీలు నెయ్యిని సరఫరా చేసేందుకు మీ పాత్ర ఎంతవరకు ఉన్నది, కనీసం నెయ్యి సరఫరా చేయడంలో అర్హత లేకున్నా మీరు వారితో జరిపిన సంభాషణలకు ఎవరి ప్రోద్బలం చేశారు, వారితో మాట్లాడమని ఎవరు చెప్పారనే ప్రశ్నలు సోమవారం సిట్ అధికారులు చిన్నఅప్పన్నను అడిగి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. టిటిడితో ప్రమేయం లేకున్నా ఎలా వారితో మాట్లాడారు అనేది ఇప్పుడు కీలకంగా రాబట్టిన సమాధానంగా తెలిసింది. బోలేబాబా డెయిరీతో బాటు ఏఆర్ డెయిరీ, వైష్ణవి ప్రీమియర్ఆపుడ్స్ తో ఒప్పందంతో భారీగా కమీషన్లు 50లక్షల వరకు రాబట్టాలని చెప్పిందెవరు, మీ బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలోల్ల 4.50కోట్ల రూపాయలు ఉండటం ఎక్కడిది, ఎవరి నుండి ఆ నగదు లావాదేవీలు జరిగాయని అడిగి సమాచారం సేకరించారు.

అప్పన్న మౌనంగా ఉన్నారని

TTD: అయితే అప్పన్న కొన్ని ప్రశ్నలకు నోరు మెదపలేదని తెలిసింది. అంతేగాక మీ పేరున ఉన్న 14వరకు స్థలాలు, ప్లాట్లు ఎక్కడ నుండి కొనుగోలు చేశారు, డబ్బులు ఎవరు ఇచ్చారు. మీ వెనుక కథ నడిపిందెవరని లోతైన విచారణ చేపట్టడంతో అప్పన్న మౌనంగా ఉన్నారని తెలిసింది. టిటిడి కొనుగోలు జిఎంతో మాట్లాడాలని ఎవరు చెప్పారు, ఎంత భారీ మొత్తంలో ఆస్తులు, నగదు ఎక్కడదనే కోణంలో తొలిరోజు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు చేసిన ప్రయత్నంలో సిట్ అధికారులు అనుకున్న స్థాయిలో సమాధానాలు రాలేదని సమాచారం. కాగా ఈనెల 21వతేదీ వరకు చిన్నఅప్పన్న సిట్ కస్టడీలో ఉండనుండటంతో 19, 20తేదీల్లో సిట్ అధికారులు హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. వైవికి సంబంధించి కల్తీనెయ్యి వ్యవహారంలో ఇంకొన్ని ఆధారాలు సేకరించేందుకు చూస్తున్నారు. అప్పన్న ఇచ్చే సమాచారం ఆధారంగా వైవిని విచారణ చేయాలని చూస్తున్నారు. అంతేగాక కల్తీనెయ్యి టెండర్లు, సరఫరా వ్యవహారంలో ఆయనకే కీలకమనేది సిట్ భావిస్తోంది. 2020వ సంవత్సరం నుండి 2024 జూన్ నెల వరకు కల్తీనెయ్యి సరఫరా చేసిన కుట్రలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Crime Investigation latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.