📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: టిటిడి వినూత్న ఆలోచన ఆచరణ సాధ్యమేనా!?

Author Icon By Ramya
Updated: July 1, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉచిత బీమా సౌకర్యం అమలుకు ముందే తర్జనభర్జనలు

Tirumala: తిరుమలకు వస్తున్న లక్షమందివరకు భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని టిటిడి తీసుకుంటున్న వినూత్న ఆలోచన ఆచరణ సాధ్యమవు తుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఆలోచన టిటిడి (TTD) పై ఆర్థికంగా భారంపడు తుందనేది టిటిడి ఉద్యోగవర్గాల్లోనూ చర్చగా మారింది. సాధారణ సర్వదర్శనంలోనూ నేరుగా కొండకు చేరుకున్న భక్తులు కిలోమీటర్లు దూరం విస్తరించిన ఆలయం వెలుపల క్యూలైన్లనుండి వైకుంఠమ్ 2 క్యూకాంప్లెక్స్ మీదుగా శ్రీవారి దర్శనానికి వచ్చే వారి పరిస్థితి ఏంటనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా భక్తులు కాలినడకన వచ్చే సమయంలో వన్య ప్రాణులు దాడిచేసినా, మరణించినా, రద్దీ సమ యంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు వంటి కారణాలతో ప్రమాదాలు జరిగితే బాధితులకు పరిహారం చెల్లించేవిధంగా పథకం రచిస్తున్నారు. అయితే అసలు ఏ హిందూ ఆలయంలో అమలులో లేని వినూత్న ఆలోచన టిటిడి పాలకమండలి చర్చించి బీమా ప్రతిపాదనపై తర్జనభర్జనలు మొదలయ్యాయి.

భక్తులకు ఉచిత బీమా.. వినూత్న ఆలోచనకేనా?

ఈ ప్రతిపాదన లపై కూడా భక్తుల నుండి, మేధావుల నుండి అభిప్రాయసేకరణ మొదలైంది. అమలుచేసే విషయంలో మాత్రం అనేక సందిగ్ధతలు, సంశయాలు వినిపిస్తున్నాయి. దేశవిదేశాల నుండి తిరుమలకు రోజుకు లక్షమంది వరకు భక్తులు వస్తున్నారు. సాధారణరోజుల్లోనే 80వేలమంది వరకు భక్తులకు దర్శనం చేయిస్తుంటే వారాంతంలో 90 వేలమందివరకు దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఈ నేపధ్యంలో భక్తులు దర్శనం టిక్కెట్, టైమ్ స్లాట్ టోకెన్ లేని వారికి బీమా ఎలా అమలుచేయాలనేది అనుమానంగా మారింది. తిరుమలకు వచ్చిన భక్తులు అనారోగ్యంబారిన పడినా, గాయపడినా ఇప్పటివరకు టిటిడి (TTD) నే సొంత ఖర్చులతో వైద్యస దుపాయాలు అందిస్తుంది. ఎవరైనా కాలినడకమార్గాల్లో, ప్రమాదాల కారణంగా మరణిస్తే ఆర్థికసాయం అందిస్తుంది. తిరుమలకు వస్తున్న భక్తులు ఘాట్ రోడ్లపైగానీ, కాలినడక మార్గాల్లో చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘాట్ రోడ్లపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే, నడకమార్గాల్లో వన్యప్రాణుల వల్ల ప్రమాదాలు జరిగి మరణిస్తే ఆ భక్తులకు ఆర్థికసాయం టిటిడి అందిస్తున్న విషయం తెలిసిందే.

భక్తులందరికీ బీమా – సాధ్యమా?

ఇదేగాక సాధారణంగానే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో బీమా సౌకర్యం కలిగిఉంటారు. అయినా వారికి ఇతోధికంగా ఆర్థికసాయం అందించాల్సి ఉందనే అభిప్రాయాలను ప్రస్తుత పాలకమండలి గట్టిగానే నిర్ణయించింది. ఇందుకు బీమా సదుపాయం కల్పించడమే ప్రధానమని ఆలోచనకు వచ్చేసింది. రోజుకు 80వేలమంది వరకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. వీరందరికీ బీమా సదుపాయం కల్పించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు బీమా సంస్థలకు టిటిడి నే ఏ విధంగా ప్రీమియం చెల్లిస్తుందనేది కూడా సమాధానాలు లేని ప్రశ్నలే. భక్తుల వివరాలను వారి కుటంబంలోని నామినీలోసహా సేకరించాల్సిన అవసరం ఉంది. అసలు ఏ ప్రాతిపదికన టిటిడి భక్తులకు బీమా సదుపాయం కల్పిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానాలు. ఇప్పటికే తిరుమలకు వస్తున్న 80వేలమంది భక్తుల్లో ఆన్లైన్లో పలు రకాల దర్శనాలు 25-30 వేల మంది భక్తులు, ఆఫ్లైన్లో 20వేలమంది, ఆర్జిత సేవలు ఐదారువేలమంది, ఇదేగాక పలురకాల సిఫార్సు లేఖల ద్వారా వస్తున్న భక్తులు మరో ఐదువేలమంది వరకు ఉంటు న్నారు. వీరందరికీ ఎలా వర్తింపజేస్తారనేది ఇప్పు డు సందిగ్ధం. అయితే ఇప్పుడు ఈ బీమా సదు పాయం మాట పాలకమండలి బ్రాండ్కోసం ప్రాకు లాటనా?లేక భక్తులకు అమలుచేసేదిశగా ఆర్థికభారమేనా అనేది ముందు ముందు తేలిపోనుంది.

Read also: Srinivasa Rao: స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలి: సిపిఎం శ్రీనివాసరావు

#Bhakti #DevoteeWelfare #FreeInsurance #HinduTemples #IndianTemples #InsuranceScheme #PilgrimSafety #SpiritualTourism #TempleNews #Tirumala #Tirupati #ttd #TTDControversy #TTDInitiative #TTDPolicy Arjitha Seva Breaking News in Telugu Breaking News Telugu devotee data devotee welfare epaper telugu footpath pilgrims free insurance scheme ghat road accidents google news telugu Hindu pilgrimage India News in Telugu Indian Temples insurance premium Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today pilgrim safety Spiritual Tourism Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today temple insurance temple insurance coverage temple management tirumala Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu TTD TTD board TTD financial burden TTD health services TTD initiative TTD online darshan TTD policy debate Vaikuntham queue complex wild animal attacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.