TTD: తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో జరిగిన నగదు దొంగతనం కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠినంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా విచారించడానికి సీఐడీ మరియు ఏసీబీ అధికారులకు పూర్తి స్వతంత్రమిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. చట్టపరమైన విధానాల ప్రకారం కేసు నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెండు సంస్థల డీజీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో
రవికుమార్ ఆస్తులపై విచారణ వేగవంతం
నిందితుడు రవికుమార్‌కు చెందిన ఆస్తులపై దర్యాప్తును కొనసాగించాలని కోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా, ఈ కేసు గతంలో లోక్ అదాలత్‌ద్వారా రాజీ అయ్యిన విషయాన్ని కూడా తిరిగి పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. దర్యాప్తు వేగాన్ని పెంచేందుకు సీఐడీ–ఏసీబీ విభాగాలు పరస్పరం సేకరించిన వివరాలను పంచుకోవాలని సూచించింది.
మాజీ టీటీడీ(Tirumala tirupathi devasthanams) ఏవీఏన్వో వై. సతీశ్ కుమార్ పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఆదేశాలతో పరకామణి కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: