📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: TTD: పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

Author Icon By Rajitha
Updated: December 5, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యాయస్థానాల్లో విచారణలో ఉండగా వివాదం

తిరుపతి : వడ్డీకాసుల వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను పరకామణి భవనం నుండి చోరీ చేసిన రవికుమార్ కేసు విషయంలో, గత వైసిపి ప్రభుత్వ హయాంలో లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరా జరిగిన కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉండగా మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాద్యత గల ఓ రాజకీయపార్టీ అధినేతగా ఉంటూ ఆయన విమర్శలు గుప్పించడం వివాదాస్పదమతోంది. మాజీ సిఎం జగన్ ఏడాదిన్నర తరువాత నోరుమెదపడం వెనుక ఆంతర్యమేమిటనేది కొందరు మేధావులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సంచలనంగా మారిన ఆ రెండు కేసుల్లో ప్రస్తుతం దర్యాప్తు, విచారణ వివరాలు మొత్తం అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో ఉండగా ఆయన గురువారం విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఛైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డితోబాటు కొందరు మాజీ అధికారులను కీలకంగా ప్రశ్నించింది. 2023వ సంవత్సరం ఏప్రిల్లో తిరుమల (TTD) పరకామణి భవనంలో గుమస్తా సివి రవికుమార్ 920 అమెరికన్ డాలర్లు చోరీ చేశాడని, దానివిలువ 72వేల రూపాయలు విలువమాత్రమేనని అప్పటి టిటిడి పెద్దలు వెల్లడించారు.

Read also: Minister Narayana: 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Former CM’s comments on Parakamani theft

శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం

దొంగతనం జరిగిన రోజే విధుల్లో ఉన్న అప్పటి ఏవిఎస్ ఒ వై.సతీశ్ కుమార్ సిసికెమెరాలద్వారా గుర్తించి అతనిని పట్టుకున్నాడు. పై అధికారుల ఆదేశాలతో తిరుమల వన్హన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తదనంతరం తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తిరుపతిలోని రెండవ అదనపు న్యాయస్థానంకు చేరింది. ఆ తరువాత అదే సంవత్సరం సెప్టెంబర్ 9వతేదీ మెగా లోక్అదాలత్లో కేసు రాజీచేసుకునే స్థాయికి ఏవిఎస్, సతీశ్ కుమార్పై ఒత్తిడి చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సమగ్ర విచారణకు సిఐడి డిజిని ఆదేశించింది. సిఐడి డిజి రవిశంకర్అయ్యన్నార్ తమ సిబ్బందితో తిరుమల, తిరుపతికి చేరుకుని చోరీ జరిగిన ఘటనకు సంబంధించి ఆధారాలు, సాక్ష్యాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

35మందిని క్షేత్రస్థాయిలో విచారణ

గతనెల 6వతేదీ నుండి డిసెంబర్ 1వతేదీ వరకు నిందితుడు సివిరవికుమార్ తో బాటు ఆయన భార్యను మరో 35మందిని క్షేత్రస్థాయిలో విచారణ చేసి అనేక వివరాలు రాబట్టారు. అతని ఆస్తులు కేసురాజీ వెనుక ఉన్న పెద్దల వివరాలు రాబట్టి సీల్డు కవర్లో హైకోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై నేడు(శుక్రవారం) న్యాయమూర్తి విచారణ చేసి తదుపరి సిఐడికి ఆదేశాలివ్వనున్న సమయంలో గురువారం మాజీ సిఎం జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని, ఈ కేసులో దొరికింది 9 డాలర్లు మాత్రమేనని ప్రాయశ్చిత్తంగా 14కోట్ల రూపాయలు ఆస్తులను టిటిడికి ఇచ్చారని ఆయన చెప్పడం ఎక్కడకు దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఇక కల్తీనెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి కీలకమైన పాత్రధారులను డెయిరీ నిపుణులను, టిటిడి మాజీ మార్కెటింగ్ జిఎం సుబ్రమణ్యంను, మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఎ చిన్నఅప్పన్నను, రసాయనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్ అజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

adulterated-ghee latest news Parakamani-theft Telugu News TTD-cases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.