📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: TTD:టీటీడీ కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ నేత అరెస్ట్

Author Icon By Sushmitha
Updated: October 30, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీటీడీ(TTD) కల్తీ నెయ్యి(Adulterated ghee) కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ వేగం పెంచిన సిట్ అధికారులు చేసిన తొలి రాజకీయ నేపథ్యం ఉన్న అరెస్ట్ ఇదే కావడం గమనార్హం. రుయాలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.

Read Also: Bhatti: విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

అరెస్టు వివరాలు, తదుపరి విచారణ

చిన్న అప్పన్నది విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలస. హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పన్నపై సిట్ పూర్తి సమాచారం సేకరించింది. గత జూన్ 4న ఒకసారి, తాజాగా బుధవారం మరోసారి చిన్న అప్పన్నను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు ఈ విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి, రిమాండు రిపోర్టులో ఏ-24గా పేర్కొన్నారు.

కేసులో కీలక మలుపు

సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు తిరిగి ప్రారంభమైన వెంటనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నుంచి ఈ కేసులో కీలక వ్యక్తుల విచారణలు, అవసరానికి అనుగుణంగా అరెస్టులు ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అరెస్టు చేసిన వ్యక్తి ఎవరు?

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న.

ఈ అరెస్టు ఏ కోర్టు ఆదేశాల మేరకు జరిగింది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సిట్ ఈ అరెస్టు చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Arrest Google News in Telugu Kaduru Chinna Appanna Latest News in Telugu sit investigation Telugu News Today Tirupati. TTD Ghee Scam YV Subba Reddy PA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.