టిటిడిలో గత నాలుగేళ్లలో కర్త, కర్మ, క్రియగా సర్వం తానై అప్పటి టిటిడి అదనపు ఇఒ, ఆ తరువాత ఇఒగా పాలన బాధ్యతలు నిర్వహించిన ఎవి ధర్మారెడ్డి కల్తీ నెయ్యి కేసులో సులభంగా అప్రూవర్ గా మారినా ఆయన వ్యవహారంపై సిట్ అధికారులు మరోసారి లోతుగా విచారణ చేసే అవకాశం లేకపోలేదనేది కీలకంగా మారింది. 2019లో వైఎస్సార్సీ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలం తరూవాత కేంద్ర రక్షణశాఖ విభాగంలో ఉన్న ఎవి ధర్మారెడ్డిని టిటిడి (TTD) కి డిప్యూ టేసన్ పై అప్పటి సిఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారు. 2020 అక్టోబర్లో ఇఒ సింఘాల్ బదిలీతో ఆ స్థానంలో ఇఒగా డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి, అదనపు ఇఒ హోదాలో ఎవి ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పటినుండి అదనపు ఇఒ హోదాలో ధర్మారెడ్డి సర్వంతానై వ్యవహరించారనే విమర్శలు పెద్ద దుమారం రేపాయి. టిటిడిలో మరీ తిరుమలలో కర్త, కర్మ, క్రియ అన్నీ ధర్మారెడ్డి కనుసైగల్లోనే నడిచిందనే విషయాన్ని అప్పటి టిటిడి బోర్డు వాదనలు.
Read also: AP: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ .. 82,000 కోట్ల భారీ పెట్టుబడి
TTD: అప్రూవర్ గా మారినా… వైవి సాక్ష్యాధారాలే కీలకం
అప్పటి బోర్డు ఛైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి చెప్పే కొన్ని విషయాలను ధర్మారెడ్డి అంగీకరించలేదని, దర్శన కోటా పెంపు, వసతి సౌకర్యం, ప్రతి శుక్రవారం అభిషేక సేవలో హాజరయ్యే విషయంపై మాటామాటా వాదనలు జరిగాయనేది గుప్పుమంది. అయితే ఈ విషయాలపై సిఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్ళినా అప్పటి బోర్డునే మందలించిన సందర్భాలు లేకపోలేదనేది ఆ రోజుల్లో తిరుమలలో వినిపించిన ప్రధాన విమర్శలు. ఇదే బాటలో రెండవసారి చైర్మన్ గా కూడా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపడం కూడా అప్పట్లో పెద్ద చర్చసాగింది. తమతో అన్ని విధాలా విబేధించే ధర్మారెడ్డితో కలసి పనిచేయలేనని కూడా జగన్ కు వివరించినట్లు గతంలోనే వైసిపి వర్గాల కథనం.
నెయ్యి కల్తీ జరిగిందనేది
అయినా 2020 అక్టోబర్ నుండి 2024 మే నెలాఖరు వరకు టిటిడిలో అదనపు ఇఒగా, ఇఒగా కూడా ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక చర్చనీయాంశమే. 2024 జూన్ 16న టిటిడి ఇఒగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన తరువాత లడ్డూల నాణ్యత, రుచిపై లోతుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేశారు. అటు కొనుగోళ్ళ కమిటీనుండి ఇటు మార్కెటింగ్ చివరకు పోటు విభాగంలో వైష్ణవ బ్రాహ్మాణులతో మాట్లాడి ఎక్కడ లోపం ఉందనే విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. వైష్ణవ బ్రాహ్మణులు కూడా ప్రధానంగా నెయ్యి నాణ్యత లేకపోవడమేనని మౌఖికంగా అభిప్రాయాలు తెలిపారు. ఈ నేపధ్యంలో తిరుమలకు వచ్చిన నెయ్యి కల్తీ జరిగిందనేది ఎన్డీబి కూడా తేల్చిన ప్రధాన అంశం. గత ఏడాది జూలై, ఆగస్ట్ నుండి ఇప్పటికీ కల్తీనెయ్యి బాగోతం దర్యాప్తు, విచారణలు సాగుతుండటం ప్రధానంగా మారింది. తాజాగా బుధవారం మాజీ ఇఒ ధర్మారెడ్డి అప్రూవర్గా మారి టిటిడిలో లోపాలు, గత బోర్డు పెద్దల తప్పిదాలు సిటు వెల్లడించడంతో మరీ ఇక జరగబోయే తతంగం మరింత వేడి పుట్టించేలా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: