📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: TTD EO: పరకామణి చోరీ కేసు ఈవోపై హైకోర్టు లో ఆగ్రహం

Author Icon By Saritha
Updated: October 17, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల పరకామణి చోరీ కేసుపై హైకోర్టు సీరియస్

అవ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం తిరుమలలోని పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టు గంభీరంగా స్పందించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయని టీటీడీ (TTD EO) అధికారులపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోను ఈ నెల 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టంగా ఆదేశించింది.

కౌంటర్ సమర్పించడంలో జాప్యం కారణంగా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరుకాలేదని తేలితే రూ. 20 వేల జరిమానా విధిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. కౌంటర్ దాఖలుకు మరికొంత గడువు కావాలంటూ టీటీడీ న్యాయవాది కోరడంతో విచారణను వాయిదా వేసింది.

Read also: ఓటీటీలో హారర్ హిట్ – క్లైమాక్స్ సూపర్!

TTD EO: పరకామణి చోరీ కేసు ఈవోపై హైకోర్టు లో ఆగ్రహం

సీఐడీ దర్యాప్తు, కీలక ఫైళ్ల స్వాధీనం

పాత ప్రభుత్వం కాలంలో విచారణలో రాజీ ఆరోపణలు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా పరకామణిలోని(TTD EO) కీలకమైన పత్రాలు, ఫైళ్లను సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. చోరీ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా కోర్టులో సమర్పించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఉన్న వివరాల ప్రకారం, 2023లో రవికుమార్ అనే ఉద్యోగిపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చినా, అప్పటి టీటీడీ అధికారులు సరిగ్గా విచారణ జరపకుండా ఈ వ్యవహారాన్ని లేపకుండా చూసారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, లోకాయుక్త ద్వారా రాజీ కుదిర్చినట్లు కొన్ని పత్రాల ఆధారంగా కోర్టుకు తెలియజేయబడింది. దీంతో శ్రీనివాసులు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీరియస్‌గా వ్యవహరిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP High Court AP temple news Latest News in Telugu Parakamani theft Telugu News temple corruption Tirumala Parakamani scam TTD Controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.