📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

TTD: శేషాచలంకొండలకు జీవనాడి ‘దివ్యఔషధ వనం’ 3.90 ఎకరాల్లో ఏర్పాటు..

Author Icon By Rajitha
Updated: December 22, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : కలియుగవైకుంఠం తిరుమలకొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణంపోసే ఔషధమొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో “దివ్యఔషధవనాన్ని” ఏర్పాటుచేయాలని టిటిడి నిర్ణయించింది. తిరుమలలో జిఎన్సి టోల్గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ విద్యఔషధవనం అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సూచనలతో టిటిడి చైర్మన్ బిఆరా నాయుడు స్వయం నిర్ణయంతో టిటిడి ఇది. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరు. మామిళ్ళ వెంకయ్యచౌదరి ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026 జనవరిలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచనున్నారు. భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసి 2026 చివరికి పూర్తి స్థాయిలో ఔషధవనాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు.

Read also: Jakkampudi : నన్నయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం

TTD

ఔషధమొక్కలను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేయడం

TTD: 4.25కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. అరుదైన, జీవవరిణామం ఉట్టిపడే శేషాచలం అడవుల్లో అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న ఉన్న జీవనాడి. దివ్యఔషధవనం ఏర్పాటుచేసేందుకు టిటిడి సంకల్పించింది. ఔషధమొక్కలను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. దీనిద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తొడ్పడనుంది. దక్షిణభారత దేశంలోనే ఈ తరహాలో రూపొందించనున్న ఔష ధవనం భక్తులు, పరిశోధకులు, విద్యార్థులు ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

భక్తి విజ్ఞానం ప్రకృతి సమ్మేళనం
తిరుమలలో టిటిడి ఏర్పాటుచేయనున్న దివ్య ఔషధవనంలో దేహ చికిత్సవనం, సుగంధ వనం, పవిత్రవనం, ప్రసాద వనం, పూజాద్రవ్య వనం, జీవరాశివనం, కల్పవృ క్షధామం. ఔషధకుండి, మూలికావనం, విశిష్టవృక్ష వనం, ఔషధమొక్కలు వంటి 13రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమేగాక ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Divya Oushadha Vanam latest news Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.