TTD: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని ఇతర ఆలయాల్లో భక్తుల సౌకర్యం, శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ తెలిపారు. తిరుమలలో సుమారు 3000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా, రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో పాటు తిరుపతిలోని బస్టాండ్, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.
Read also: Minister Satyakumar: ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశం
వదంతులను నమ్మకుండా
TTD: డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లతో భక్తులను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. నకిలీ టోకెన్లతో వచ్చినవారికి అనుమతి ఉండదని, ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మకుండా, టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం పొందాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: