📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట

Author Icon By Saritha
Updated: March 4, 2026 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు హైదరాబాద్ (Hyderabad) కోర్టులో భారీ ఊరట లభించింది. తనపై జరుగుతున్న విషప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Read Also: Cricket Betting Racket: నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

TTD Chairman: TTD Chairman BR Naidu gets relief in Hyderabad court

తనపై ఆధారరహిత కథనాలు ప్రసారం చేయొద్దని మీడియాకు ఆదేశం

తనపై ఎలాంటి ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ప్రసారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కోర్టు స్పష్టంగా ఆదేశించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రచురితమైన లేదా ప్రసారమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నట్లు వివరించారు. ఇదే సమయంలో గూగుల్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సైతం సంబంధిత కంటెంట్‌ను తమ సైట్ల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినట్లు నాయుడు పేర్కొన్నారు.

ఇది తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర

తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. “సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Hyderabad Court Gag Order Social Media Defamation TTD Chairman BR Naidu TTD News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.