📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD Panchangam 2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

Author Icon By Siva Prasad
Updated: February 28, 2026 • 10:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD Panchangam 2026-27: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర (2026-27) పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో ఎం.రవిచంద్రతో కలిసి శనివారం ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Read Also: Tirumala : తిరుమలలో యూట్యూబర్ రీల్స్.. TTD వార్నింగ్

అందరికీ అర్థమయ్యేలా రూపకల్పన

ఈ సందర్భంగా చైర్మన్ బి.ఆర్.నాయుడు మాట్లాడుతూ.. ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏటా ఉగాది నాటికి పంచాంగాలను భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ నూతన పంచాంగాన్ని టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ రచించగా, వైఖానసాగమ పండితులు ఆచార్య శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు అందరికీ సులభంగా అర్థమయ్యేలా పరిష్కరించారు. ఇందులో రాశిఫలాలు, వివాహ సుముహూర్తాలు, వధూవర గుణమేళనం మరియు టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను పొందుపరిచారు.

TTD Panchangam 2026-27: ధర మరియు లభ్యత

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డాక్టర్ ఎ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Hindu Calendar 2026 Parabhava Nama Samvatsaram tirumala news today Tirupati Panchangam Price TTD Chairman BR Naidu TTD EO Ravi Chandra TTD Panchangam 2026-27

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.