📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

BR Naidu: డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

Author Icon By Anusha
Updated: March 1, 2026 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను వాడుకుని, తన రూపాన్ని అనుకరిస్తూ సృష్టించిన నకిలీ డీప్‌ఫేక్ (Deepfake) వీడియోలను కొందరు కావాలనే వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు, పవిత్రమైన టీటీడీ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఈ చర్యలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

చట్టపరమైన చర్యలకు సిద్ధం: బీఆర్ నాయుడు హెచ్చరిక

ఈ మేరకు బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. “ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం ఇది. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం ముందుకెళతానని స్పష్టం చేశారు.

ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలే ప్రసక్తే లేదని బీఆర్ నాయుడు హెచ్చరించారు. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI Manipulated Content BR Naidu BR Naidu vs YCP Social Media Deepfake Videos on TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.