తిరుమల Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి సంబంధించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ముద్రించిన 2026 నూతన సంవత్సరం క్యాలండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని గతనెల 24వతేదీ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి
చంద్రబాబు Chandrababu ఆవిష్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం తిరుమల, తిరుపతితో బాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, హిమాయత్నగర్, న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, వేలూరు, చెన్నైలతో బాటు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులోని టిటిడి కల్యాణమండపాల్లో టిటిడి నూతన సంవత్సరం క్యాలండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 12 పేజీలు క్యాలండర్, calendar ఆరపేజీల క్యాలండర్, టేబుల్ క్యాలండర్, డీలక్స్ డైరీలు,పెద్దడైరీలు ఇలా స్వామివారి ప్రతిమల క్యాలండర్లు కొనుగోలుచేసుకునే అవకాశం కలిగింది.
Diwali 2025 : దీపావళి పండుగ అక్టోబర్ 20 లేదా 21 ఎప్పుడు జరుపుకోవాలి అంటే?
TTD Calendars
టిటిడి వెబ్సైట్
టిటిడి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా భక్తులు బుక్ చేసుకునే సదుపాయం టిటిడి కల్పించింది. ఆన్లైన్లో బుక్చేసుకున్న వారికి తపాలశాఖ ద్వారా ఇంటివద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లు అందజేయ బడుతాయి. “డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తిరుమల.ఓఆర్ జి, టిటిదేవస్థానమ్స్. ఎపి. జిఒవి. ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు.
2026 టిటిడి క్యాలండర్లు, డైరీలు ఎప్పుడు విడుదలయ్యాయి?
2026 టిటిడి క్యాలండర్లు, డైరీలు గత నెల 24వ తేదీన జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ప్రస్తుతం టిటిడి క్యాలండర్లు, డైరీలు ఎక్కడ లభ్యమవుతున్నాయి?
తిరుమల, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, హిమాయత్నగర్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, వేలూరు, చెన్నైతోపాటు కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు నగరాల్లోని టిటిడి కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: