📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD: అప్రూవర్ గా ధర్మారెడ్డి.. కల్తీ నెయ్యి కేసులో పెద్ద ట్విస్ట్

Author Icon By Rajitha
Updated: November 13, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత బోర్డు సభ్యులు ఇక తెరపైకి! తిరుపతి : హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి (Tirupathi) దేవస్థా నంలో ధర్మకర్తల మండలి(బోర్డు)నే కీలకమన్న (సుప్రీమ్ అని) వ్యాఖ్యలు చేసిన, కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇఒ ఎవి ధర్మా రెడ్డి బుధవారం అప్రూవర్ గా మారడం సంచలనం కలిగించింది. కల్తీనెయ్యి సరఫరా, కాంట్రాక్టు టెండర్లు అప్పగించడం, నెయ్యి వినియోగం వంటి విషయాలు కూడా గత టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇష్ట ప్రకారమే జరిగిందని సిబిఐ సిట్ కు వివరాలు వెల్లడించడంతో పెద్దట్విస్ట్ నెలకొంది. అంతేగాక 2019 జూన్ నెల నుండి 2020 అక్టోబర్ నెల వరకు టిటిడి ఇఒగా (ప్రస్తుతం విధుల్లోఉన్న ఇఒ) అనిల్ కుమార్ సింఘాల్ వ్యవహరించారని సిట్ కు ధర్మారెడ్డి చెప్పడం మరోప్రత్యేకమైన అంశం. 2019 జూన్నలనుండి 2020 అక్టోబర్ నెల వరకు టిటిడికి అవసరమైన నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు పిలిచారా? పిలిస్తే ఎక్కడెక్కడ నుండి టెండర్లు దాఖలు చేశారు.

Read also: AP: ఏపీ యువతకు శుభవార్త.. ఉచితంగా సివిల్స్ కోచింగ్

TTD: అప్రూవర్ గా ధర్మారెడ్డికల్తీ నెయ్యి కేసులో పెద్ద ట్విస్ట్

కల్తీనెయ్యి వెనుక

ఏఏ డెయిరీ యాజమాన్యాలు పాల్గొన్నాయి, ఎలా టెండర్లు నిర్వహించి నెయ్యి సరఫరాకు అంగీకరించారనేది ఇప్పుడు సిట్ అధికారుల ముందు తేల్చాల్సిన పెద్ద ప్రశ్న. 2020వ సంవత్సరం నుండి 2024 మేనెల వరకు సరఫరా అయిన కల్తీనెయ్యి వెనుక ఇఒగా తన పాత్ర కేవలం నిమిత్తo మాత్రమేనని ధర్మారెడ్డి రెండవ రోజు బుధవారం కూడా విచారణలో అదే విషయాన్ని వెల్లడించడం ఎంతవరకు నమ్మశక్య మనేది సిట్ తేల్చేపనిలో నిమగ్నం కానుంది. రాష్ట్రంలో 2019 మే 23న వైఎస్సార్సీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నెల రోజులకు 2019 జూన్ 22న టిటిడి నూతన ధర్మకర్తల మండలి (బోర్డు) ఏర్పాటు చేశారు. అప్పటి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయి వైవి సుబ్బారెడ్డిని చైర్మన్ గా నియమించారు. ఆయన నేతృత్వంలో 38 మంది వరకు జంబో పాలక మండలి ఏర్పాటైంది.

కల్తీలో రసాయనాలు

ఆ సభ్యుల్లో కొందరు కీలకంగా కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా కూడా వ్యవహరించారు. మరీ వారందరినీ ఇక సిట్ విచారణకు పిలుస్తుందా? లేక రేపోమాపో మాజీఛైర్మన్ వైవి సుబ్బా రెడ్డిని, మరో మాజీచైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ కలిగించే విషయంగా మారింది. 2020వ సంవత్సరం నుండి 2024మేనెల వరకు తిరుమలకు నెయ్యి సరఫరాలో కీలకంగా వున్న డెయిరీ యాజయాన్యం, నిర్వాహకులతో బాటు కాంట్రాక్టర్లను ఇప్పటికే సిట్ పలు కోణాల్లో విచారణ చేసి ఆధారాలు రాబట్టి అరెస్ట్ చేసేసింది. వారంతా రిమాండ్లో కటాకటాల్లో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు బెయిల్ పై బయట వున్నారనేది సమాచారం. ఇప్పుడు గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఎ చిన్నఅప్పన్న, కల్తీలో రసాయనాలు సరఫరా చేసిన అజయ కుమార్ ను కస్టడీకి తీసుకునేందుకు సిట్ అధికారులు ఎసిబి కోర్టును ఆశ్రయించారు. 14న ఈ విషయంపై న్యాయమూర్తి తీర్పు వెలువడించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

DharmaReddy FakeGheeScam latest news SIT Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.