📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: టిటిడిలో మరో అన్యమత అధికారి గుర్తింపు

Author Icon By Sharanya
Updated: July 15, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి: హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతాన్ని ఆచరించే మరో అధికారి ఏకంగా తనకారుపైన అన్యమతప్రార్థనల వాక్యాలు రాసుకోవడం, చేతిలో ఆ మత గ్రంథాన్ని పెట్టుకుని అందరూ మతాన్ని ఆచరించాలని బెదిరించడం వెలుగుచూసింది. వారంరోజుల క్రిందట తిరుపతిలోని టిటిడి (TTD) పరిపాలన భవనంలో మార్కెటింగ్ విభాగం వేలం విధులు నిర్వహించే అసిస్టెంట్ కార్యనిర్వహణాధి కారి(ఎఇఒ) రాజశేఖరబాబు (AEO Rajasekhara Babu) అన్యమతాన్ని ఆచరిస్తున్నాడని, ప్రార్థనలకు హాజరవుతున్నాడనే సాక్ష్యాధారాలతో సస్పెండ్కు గురయ్యాడు.

దేవస్థానంలో అన్యమతాన్ని ఆచరిస్తున్నారని

తాజాగా టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ఇలియాజర్ అన్యమతాన్ని ఆచరిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సోమవారం కర్నూలు లోని టిటిడి (TTD) కల్యాణమండపంలో జరుగుతన్న పనుల పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్. అధికారిగా వెళ్ళడంతో అతని తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. అంతేగాక ఆయన ప్రయాణించిన కారుపై తాను అన్యమతస్థుడని, ఆ మతాన్ని ఆరాధించాలని (worship religion) చెప్పే ప్రచారం చేసుకునే స్టిక్కర్లు వేసుకోవడం సంచలనంగా మారింది. అంతేగాక ఆయన చేతిలో ఆ మతానికి చెందిన గ్రంధాన్ని పట్టుకుని మీరు దీన్ని చదవాలని చెప్పాడని ఆరోపణలు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది నా వ్యక్తిగతమని ఘాటుగా సమాధానమిస్తాడని తెలిపారు. ఈ విషయంపై సోమ వారం మధ్యాహ్నం బిజెపి రాష్ట్ర అన్యమత అధికార ప్రతినిధి, తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తాయి. వెంటనే అన్య మత అధికారిని గుర్తింపు టిటిడి నుండి తప్పిం చాలని డిమాండ్ చేశారు. అన్యమత స్థులను టిటిడి నుండి తరిమివేయాలని బలంగా వాదనలు వినిపి స్తున్నారు. అంతేగాక మాజీ చైర్మన్ భూమన కరు ణాకర్రెడ్డి అన్యమత స్థులకు వంతపాడటం ఈ నిదర్శనాలపై ఏమంటారని ఎద్దేవాచేశారు. అన్య మతస్థులను వెంటనే టిటిడి నుండి తరిమి వేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Medical Colleges: పదోన్నతికి నిబంధనల మినహాయింపు..

Anymata adhikari Breaking News Hindu sentiments TTD latest news Non-Hindu officer in TTD Religious appointments TTD Tirumala temple issues TTD latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.