📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: రోజుకు 2.5లక్షల మందికి అన్నప్రసాదం

Author Icon By Sharanya
Updated: June 16, 2025 • 10:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకరోజుకు రూ.44లక్షలు వ్యయం

తిరుమల : ఏడకొండల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం దేశవిదేశాల నుండి వస్తున్న భక్తులకు తిరుమల, తిరుపతిలో (Tirupati) కలిపి రోజుకు సరాసరి 2.50లక్షలమంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులకు రుచిగా, శుచిగా నాణ్యతతో కూడిన పదార్థాలతో అన్నప్రసాదా లను తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది. భక్తుల రద్దీ, అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరగడంతో అవసరమైన మేరకు దాతలైన భక్తుల కోరిక మేరకు అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే.

TTD: రోజుకు 2.5లక్షల మందికి అన్నప్రసాదం

లక్షలాదిమంది భక్తులకు ఉచిత భోజనాలు


శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థమ్ తిరుమలకు వస్తున్న లక్షలాదిమంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు వడ్డించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. అంతేగాక పుట్టినరోజు, వివాహ వార్షికోత్స వం, ఇతరత్రా ప్రాధాన్యత రోజుల్లో దాతలైన భక్తులు తమ పేరున భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే అవకాశం కల్పించారు. ఇందుకు ఒకరోజు పూర్తిగా 44లక్షలు రూపా యలు విరాళం అందించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం 10లక్షలు రూపాయలు, మధ్యాహ్నం భోజనం కోసం 17లక్షలు, రాత్రి భోజనం కోసం 17లక్షలు అందించి దాత లు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించిన దాత పేరును మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు కోరిక మేరకు వారే స్వయంగా ఒకరోజు ఇక్కడ అన్నప్ర సాద వితరణ చేయొచ్చు. తిరుమలకొండకు వచ్చిన భక్తులు ఆకలి అనేది తెలియకుండా అక్షయపాత్రలా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి రుచిగా అన్నప్రసాదాలు మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ అన్నప్రసాదం భవనంలోనేగాక మరికొన్నిప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

తిరుమలలో అన్నప్రసాదాలు ప్రాంతాలు

దేశవిదేశాల నుండి ఏడుకొండలకు వస్తున్న లక్షలాదిమంది భక్తులకు తిరుమలలో రుచిగా, శుచిగా పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాల కౌంటర్లు ఏర్పాటుచేసి పంపిణీ చేస్తున్నారు. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2, లోని కంపార్టుమెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి వుండే కాంప్లెక్స్, 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన కంపార్టుమెంట్లు, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, పాలు అందిస్తున్నారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8.30గంటల నుండి 10.30గంటల వరకు చట్నీతో కలిపి ఉప్మా. పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు, తిరిగి సాయంత్రం 5గంటల నుండి రాత్రి 11గంటల వరకు చక్కెరపొంగలి, చట్నీ, అన్నం, కూర, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. అన్నప్రసపాదాల తయారీకి రోజుకు 14 నుండి 16.5టన్నుల బియ్యం, 6.5 టన్నుల నుండి 7.5టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. తిరుపతిలో గోవిందరా జస్వామి ఆలయం, శ్రీనివాసం వసతిసముదా యం. విష్ణునివాసం కాంప్లెక్స్లు, రుయా ఆస్పత్రి, స్విమ్స్, ప్రసూతి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ యూ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

Read also: CM Chandrababu : నేడు విశాఖకు CM చంద్రబాబు

Chandrababu Naidu: కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు సమావేశం

#2_5LakhPeople #AnnadanamMahaDanam #Annaprasadam #DailyService #Tirumala #ttd Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.