నేడు ధ్వజారోహణం, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు తిరుమల TTD : ఏడుకొండల వేంకటేశ్వరస్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు తొలి ఘట్టం ఆరంభమైంది. మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు ‘అంకురార్పణ’ చేపట్టారు. సాయంత్రం నిత్యకైంకర్యాలు పూర్తయిన తరువాత రాత్రి 7గంటలకు శ్రీనివాసుడి సర్వసేనాధిపతి విశ్వక్సే నులవారు ఆలయం నుండి వెలుపలకు వచ్చి మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి నైరుతివైపు ఉన్న వసంతోత్సవ మండపంకు చేరుకున్నారు. అక్కడ సర్వసేనాధిపతి పర్యవేక్షణలో నాలుగుమాడవీధుల్లో ఊరేగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైఖానస ఆగమంలోని క్రతు వుల్లో అంకురార్పణం, బీజావాహనం అత్యంత ముఖ్యమైంది. TTD ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్ధించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటల నుంచి 9గంటల వరకు సేనాధిపతి వసంతమండపంలో మృత్సం గ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్ను సేకరించి నవధాన్యాలను నాటారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరుపోస్తారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే దేవలోకం నుండి విచ్చేసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని ఆర్యోక్తి. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, TTD Chairman BR Naidu బోర్డు సభ్యులు, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడ్ అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ. ఆలయ డిప్యూటీ ఈఓ లోక నాథం, ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, విఎస్ఒ VSO లు ఎన్టీవిరామ్కుమార్, సురేంద్ర, ఆలయ ఏవిఎస్ రాజశేఖర్ అర్చకులు పాల్గొన్నారు.
TTD
నేటి సాయంత్రం ధ్వజారోహణం: బుధవారం సాయంత్రం 5.43-6.15గంటల మధ్య మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాల వేడుకలు మొదలుకానున్నాయి. శ్రీదేవిభూదేవి. ఉభయదేవేరులతో కలసి మలయప్పస్వామికి నేటి ఉదయం బంగారువాకిలిలో విశేష సమర్పణ చేస్తారు. యాగశాలలో సంప్రదాయ కార్యక్రమాల అనంతరం ఉత్సవర్లతో బాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి ధ్వజపటం తదితరాలు తిరుచ్చిలో నాలుగుమాఢవీధులప్రదక్షిణగా ఆల యానికి వేంచేపు చేస్తారు. ఆలయంలోనికి వేంచేపుచేసి ధ్వజస్తంభంపైకి గరుడపటాన్ని అధిరో హిస్తారు. ఈ గరుడపటం ధ్వజారోహణంతో గోవిందుని బ్రహ్మోత్సవ వాహనసేవలు మొదల వుతాయి. ఈ సందర్భంగా ఆలయంలో తొమ్మిది రోజులు 9 Days అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. పూర్తిగా సర్వదర్శనంలో మాత్రమే. భక్తులకు దర్శనం కల్పిస్తారు. ముందస్తు గదుల బుకింగ్ రద్దుచేశారు. భక్తుల కోసం 8లక్షల లడ్డూలు తయారుచేసి నిల్వవుంచారు. బ్రహ్మోత్స వాలకు విచ్చేసే సామాన్యభక్తులకు వాహనసేవల తోబాటు మూలవిరాట్టు దర్శనం చేసుకునేలా టిటిడి అధికారులు ఏర్పాట్లు చేశారు.
రుమలేశుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
మంగళవారం సాయంత్రం అర్చకులు శాస్త్రోక్తంగా ‘అంకురార్పణ’ నిర్వహించడం ద్వారా ప్రారంభమయ్యాయి.
అంకురార్పణ అంటే ఏమిటి?
ఏదైనా ఉత్సవం విజయవంతం కావాలని ప్రార్థిస్తూ, భూమాతకు పూజలు చేసి పుట్టమన్నుతో నవధాన్యాలను నాటే వైదిక కార్యక్రమం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: