వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు

Read Time:  1 min
TTD and railway services on WhatsApp.. CM Chandrababu
TTD and railway services on WhatsApp.. CM Chandrababu
FONT SIZE
GET APP

వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు..

అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. త్వరలో టీటీడీ, రైల్వే సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు ఉండాలని సూచించారు.

image

ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని శాఖలు తమ సర్వర్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరు అధికారుల తీరుతో ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని, అటువంటి అధికారులు తమ విధి నిర్వహణ తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కూడా అధికారులు మరింత వేగంగా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటూ, సేవలను మరింత మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు సూచించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.