📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: TTD: కల్తీ నెయ్యి.. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్

Author Icon By Aanusha
Updated: October 30, 2025 • 7:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీటీడీ (TTD) కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న (35)ను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతనికి ఉన్న సంబంధాలపై సిట్ సుదీర్ఘ విచారణ జరిపి, ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Railway Upgrade: తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!

వివరాల్లోకి వెళ్తే..విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసకు చెందిన చిన్న అప్పన్న, హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతిలోని సిట్ (SIT) కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిపించారు. హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుదీర్ఘంగా విచారించిన అనంతరం చిన్న అప్పన్నను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

రిమాండ్ రిపోర్టులో చిన్న అప్పన్నను

ఆ తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టు (ACB Court) లో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రాత్రి సమయం కావడంతో న్యాయమూర్తి నివాసంలో నిందితుడిని హాజరుపరచనున్నారు. రిమాండ్ రిపోర్టులో చిన్న అప్పన్నను ఏ-24 (24వ నిందితుడు)గా పేర్కొన్నారు.గతంలో జూన్ 4న చిన్న అప్పన్నను సిట్ విచారణకు పిలవడంతో వైవీ సుబ్బారెడ్డి వర్గంలో కలకలం రేగింది.

ఆ వెంటనే ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ కొనసాగడాన్ని సవాల్ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించింది. సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. విచారణ మొదలైన కొద్ది రోజులకే ఈ కీలక అరెస్ట్ జరగడం గమనార్హం.

చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

latest news Telugu News TTD Ghee Scam YV Subba Reddy PA Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.