📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: తిరుమలలో20వేల నుండి లక్షదాటిన భక్తులు !

Author Icon By Ramya
Updated: June 14, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

1990లో రోజుకు 20వేలమంది భక్తులే

TTD: 1990వ సంవత్సరం వరకు రోజుకు 20వేలమంది భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకునేవారు. వచ్చిన అందరికి ఆలయం లోపల ఆనందనిలయంలో కొలువైన శ్రీవేంక టేశ్వరస్వామిని మరీ దగ్గరగా వీక్షించేలా కులశేఖరపడివరకు అనుమతించేవారు. 1992వ సంవత్సరంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజువారీగా 30వేలకు చేరింది. దీంతో అదే సంవత్సరం ఆలయం లోపల రాములవారిమేడవరకు (లఘుదర్శనం) మాత్రమే అనుమతించి దేవుని దర్శనం చేయించేవారు.

2000లో రద్దీ పెరగడంతో వైకుంఠమ్ 2 కాంప్లెక్స్ నిర్మాణం

ఇలా 2000వ సంవత్సరంలో ఈ రద్దీ కాస్త పెరిగి రోజుకు 60వేలమంది వరకు వచ్చేవారు. ఉన్న వైకుంఠమ్ 1 క్యూకాంప్లెక్స్ నిండిపోయి భక్తులు అసౌకర్యానికి గురయ్యేవారు. దీన్ని తెలుసుకున్న అప్పటి రాష్ట్రప్రభుత్వం, టిటిడి పాలకమండలి అదనంగా మరో వైకుంఠమ్ క్యూకాంప్లెక్స్ అవసరాన్ని గుర్తించింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగడంతో 2000 సంవత్సరంలో వైకుంఠమ్ 2 కాంప్లెక్స్ నిర్మించి క్రౌడ్మేనేజ్ చేశారు. అక్కడ నుండి ప్రతి ఏటా తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి భక్తులు రోజువారీగా అనూహ్యంగా లక్షమంది దాటడంతో ఔటర్ రింగురోడ్డు శిలాతోరణంవరకు కిలోమీటర్లు క్యూలైన్లలో భక్తులు ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ రోజులలోనే లక్షమందివరకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఇక వారాంతం, ప్రత్యేక పర్వ దినాలు, విశేషరోజుల్లో 1.50లక్షల మంది వరకు వైకుంఠమ్ క్యూకాంప్లెక్స్-3 నిర్మాణంతోనే వెలుపల క్యూలైన్ల నియంత్రణభక్తులు చేరుకుంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల ప్రవాహం

సాధారణరోజుల్లోనే లక్షమందివరకు భక్తులు కొండపైకి వస్తే వైకుంఠమ్ 1, వైకుంఠమ్ 2 క్యూకాంప్లెక్స్ లలో 62 కంపార్టుమెంట్లు నిండిపోతున్నాయి. ఒక్కోకంపార్టుమెంట్లో 400మంది లెక్కన 25వేలమంది వరకు భక్తులు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో 40వేలమంది భక్తులు వస్తేనే వైకుంఠమ్ -1,2 క్యూకాంప్లెక్స్లు నిండిపోయి నారాయణగిరిషెడ్లు నిండి ఆలయం వెలుపల మూడుకిలోమీటర్లు దూరం భక్తుల లైన్లు వ్యాపిస్తున్నాయి. గంటకు 4,500మంది భక్తులను ఆలయంలోపల అనుమతిస్తున్నం 90 వేలమందికి మాత్రమే దర్శనం చేయించగలుగుతున్నారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవమ్.. ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం రోజురోజుకూ, ఏడాదికేడాది భక్తుల సంఖ్య అనూహ్యంగా రెట్టింపవుతున్న నేపధ్యంలో వైకుంఠమ్ క్యూకాంప్లెక్స్లు సాధారణ రోజుల్లోనే నిండిపోతున్నాయి.

వైకుంఠమ్ కాంప్లెక్స్‌లు నిండిపోతేనే భక్తులకు ఇబ్బందుల ప్రారంభం

వైకుంఠమ్ కాంప్లెక్స్ లు నిండితేనే భక్తులకు కష్టాలు మొదలవుతాయి. ఎండకు,వానకు చలికి ఇబ్బందులు వడటం తప్పడంలేదు. ఇప్పటికీ టిటిడి పాలకమండలి చైర్మన్ బీఆర్ .నాయుడు, శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి వెలుపల క్యూలైన్లలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. దీంతో భక్తులు కొంతవరకు సంతోషంగా నిరీక్షిస్తున్నారు. అయితే తిరుమలేశుని దర్శనార్థం దేశవిదేశాల నుంచి కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. నెలవారీగా 23లక్షలమంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటుండటం జరుగుతుంది. లక్షమంది భక్తులకు మరింత సులభంగా దేవుని దర్శనం చేయించడం గగనంగా మారింది. వచ్చిన ప్రతి భక్తునికి సంతృప్తికర దర్శనమ్ కల్పించే మాట ఎలా ఉన్నా ఇష్టదైవాన్ని దర్శించుకున్న భక్తులు సంతోషంగా తిరిగి వెళ్ళాలని తిరుమల తిరుపతి దేవస్థానమ్ అధికారులు ఆకాంక్షించడం పరిపాటి. అంతేగాక మహాలఘు దర్శనం కూడా లఘుదర్శనం చేయించే భాగ్యం కలుగుతుందనే సూచనలు వినిపిస్తున్నాయి. సులభంగా భక్తులు ఆలయంలోనికి చేరుకునేందుకు వీలుగా 2014వ సంవత్సరంలోనే వైకుంఠమ్ 1కు సమీపంలో ఏటిసి వద్ద ప్రత్యేక ప్రవేశ దర్శనాల కాంప్లెక్స్ ను, కాలినడక భక్తులకు దివ్యదర్శనం కాంప్లెక్స్ కు అప్పటి టిటిడి ఇఒ డాక్టర్ సాంబశివరావు, జెఇఒ కెఎస్ శ్రీనివాసరాజులు ముందుచూపుతో నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏడుకొండలపై 50వేలమంది భక్తులు సంఖ్య పెరిగితేనే క్యూలైన్లు తిరుమల వెలుపల కిలోమీటర్లు దూరం విస్తరిస్తున్నాయి.

Read also: CM Chandrababu: రేపు సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ ప్రముఖుల భేటీ

#ATCComplex #DevoteesRush #DivyaDarshan #MahalaghuDarshan #SriVariDarshan #SriVenkateswaraSwamy #Tirumala #TirumalaCrowd #TirumalaDarshan #TirumalaDevotees #TirumalaPilgrimage #TirumalaTemple #TirumalaUpdates #Tirupati #ttd #TTDDevotees #TTDInitiatives #TTDManagement #TTDNews #TTDQueueLines #TTDQueueSystem #TTDUpdates #TTDVaikuntham #Vaikuntham #VaikunthamComplex Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.