📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Trust – సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మాజీ సెక్రటరీ ప్రసాద్ రావు కన్నుమూత

Author Icon By Shravan
Updated: September 3, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పుట్టపర్తి రూరల్ Trust : శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన, మాజీ ఐఏఎస్ అధికారి జి ఎస్ ఆర్ సి వి ప్రసాద్ రావు కన్నుమూశారు. సోమవారం సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. జి ఎస్ ఆర్ సి వి ప్రసాద్ రావు పూర్తి పేరు గుర్రం సీతారామచంద్ర వరప్రసాద రావు. ఈయన పశ్చిమగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించాడు. ప్రసాద్ రావు (Prasad Rao) విద్యాభ్యాసం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో అభ్యసించాడు. మొట్టమొదటిగా రంగరాయ మెడికల్ కాలేజీలో ఫార్మ విభాగపు హెచ్డిగా పనిచేశారు. 1968 లో తిరుపతిలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మా విభాగపు హెచ్డిగా పనిచేశారు. 1979 నుండి 76 వరకు విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫార్మా డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి గా పనిచేశారు. 1976లో ఐఏఎస్ పూర్తి చేసి ఆముదాలవలస లోని షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. 1980లో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) డైరెక్టర్ గా పని చేశారు.

సత్యసాయి సేవలో విశిష్టమైన జీవితం గడిపిన జి.ఎస్.ఆర్.సి.వి. ప్రసాద్ రావు కన్నుమూత!

అనంతరం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీగా విశిష్ట సేవలు అందించారు. 1984లో ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ గా ఏడు సంవత్సరాల పాటు పనిచేశారు. వివిధ ప్రభుత్వ శాఖలలో విశిష్ట సేవలు అందించి 1999లో పదవి విరమణ పొందారు. మొట్టమొదటిగా పుట్టపర్తికి జి ఎస్ ఆర్ సి వి ప్రసాద్ రావు సతీమణి సత్యసాయిబాబా భక్తురాలు కావడంతో 1968లో మొట్టమొదటిసారిగా సత్య సాయి బాబా దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. 1976లో తన ఇంటిలో సత్య సాయి బాబా నామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి (Sathya Sai Baba) చిత్రపటంలో జరిగిన అద్భుతమైన లీలను ప్రత్యక్షంగా దర్శించడంతో సత్య సాయి ని దైవ స్వరూపంగా భావించి అప్పటినుండి సత్యసాయి దర్శనార్థం పుట్టపర్తికి విచ్చేసేవారు. ఉద్యోగ పదవీ విరమణ అనంతరం సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2009 నుండి 2011 వరకు సత్యసాయి మెడికల్ ట్రస్ట్ సెక్రటరీగా సేవలందించారు. 2011 నుండి 2022 వరకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చీఫ్ సెక్రటరీగా 11 సంవత్సరాల పాటు నిస్వార్థమైన సేవలను అందించారు. 2022 అనంతరం తన శేష జీవితాన్ని ప్రశాంతి నిలయంలో దైవచింతనాలతో కొనసాగిస్తూ, 1 సెప్టెంబర్ 2025 న కన్నుమూశారు.

జి.ఎస్.ఆర్.సి.వి. ప్రసాద్ రావు ఎవరు?
జి.ఎస్.ఆర్.సి.వి. ప్రసాద్ రావు మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీగా, డ్రగ్ కంట్రోలర్‌గా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చీఫ్ సెక్రటరీగా 11 సంవత్సరాలు సేవలు అందించారు.

ప్రసాద్ రావు సత్యసాయి సేవలతో ఎలా అనుబంధమయ్యారు?
ఆయన భార్య భక్తురాలు కావడంతో 1968లో మొదటిసారి పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయి బాబా లీలను అనుభవించిన తర్వాత జీవితాంతం సత్యసాయి సేవలో కొనసాగి, మెడికల్ ట్రస్ట్ మరియు సెంట్రల్ ట్రస్ట్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/gst-andhra-pradesh-sets-new-record-in-gst-collections/andhra-pradesh/540488/

Andhra Pradesh News Breaking News in Telugu Latest News in Telugu Puttaparthi news Satya Sai Central Trust Spiritual organizations Telugu News Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.