ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు రవాణా ఛార్జీలను చెల్లించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద ఊరటను కలిగించే నిర్ణయం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు (Government Schools) దూరంగా వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లించనుంది.2025-26 విద్యా సంవత్సరానికి కేంద్రం రూ.47.91 కోట్లు మంజూరు చేయగా ఈ డబ్బుల్ని విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్‌లలో జమ చేస్తారు. విద్యాహక్కు చట్టం (RTE – Right to Education Act) ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ సంస్కరణల్లో భాగంగా పాఠశాలల హేతుబద్ధీకరణ చేసింది.
రవాణా ఛార్జీలలో
ఈ క్రమంలో కొన్ని ప్రభుత్వ బడులు దూరమయ్యాయి. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్ ఒక నిర్ణీత దూరంలో ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ బడి దూరంగా ఉంటే కనుక విద్యార్థులు వెల్లేందుకు, వచ్చేందుకు అవసరమయ్యే రవాణా ఛార్జీలను ప్రభుత్వం చెల్లించాలి. అయితే స్కూల్ విద్యార్థులకు (School Students) అందించే ఈ రవాణా ఛార్జీలలో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం కలిపి ఇస్తారు.ఈ విద్యా సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థులకు అందజేసే ఈ రవాణా ఛార్జీలను తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేయాలని భావిస్తున్నామని చెప్పారు సమగ్ర శిక్షాభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు. ఈ డబ్బుల్ని విడతల వారీగా అందజేస్తారు. ఏపీ విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో కొన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చింది.9 రకాల స్కూళ్లను తీసుకొచ్చింది.
విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించనుంది
రాష్ట్రంలో మొత్తం 9వేల600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయగా ఈ క్రమంలో దగ్గరలో ఉన్న మూడు, నాలుగు, ఐదు తరగతుల్ని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం, ఈ ప్రాథమికోన్నత బడుల స్థాయిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులు దగ్గరలోని ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం (AP Government) రాష్ట్రంలో మొత్తం 79,860 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించనుంది. ‘ఒకటో తరగతి నుంచి 5 తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఆవాసానికి కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ఉన్నా 6, 7, 8 తరగతుల పాఠశాలలు 3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్నా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తారు.
ప్రభుత్వం చెల్లిస్తున్న రవాణా ఛార్జీలు
గతంలో విద్యా సంవత్సరం చివరలో ఒకేసారి రూ.6 వేలు ఇచ్చేవారు. కానీ ఈసారి మూడు నెలలకోసారి ఇస్తే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ స్కూళ్లు దూరంగా ఉన్న చోట పిల్లలు ఆటో (Auto) ల్లో బడులకు వెళ్తున్నారు.తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలపై దింపినా పెట్రోల్ ఖర్చు అవుతుంది’ అన్నారు అధికారులు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం చెల్లిస్తున్న రవాణా ఛార్జీలు పొందే విద్యార్థుల సంఖ్య (12951) ఎక్కువగా ఉంది. అత్పల్యంగా గుంటూరు జిల్లాలో 437మంది ఉన్నారు.
ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడానికి
మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యకు తోడ్పడే కీలక చర్యగా నిలుస్తుంది. ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థు (Students) ల సంఖ్య పెరగడానికి, పిల్లల విద్య పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగడానికి ఇది ఒక కొత్త దారిగా మారనుంది. రాష్ట్రం విద్యా రంగంలో మరింత అభివృద్ధి సాధించాలంటే ఇలాంటి హేతుబద్ధమైన చర్యలు అవసరం. విద్యను అందరికీ సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం అభినందనీయంగా మారింది.
Read Also: Chandrababu: కుప్పంలో చంద్రబాబు చేతుల మీదుగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం