📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Ration – స్మార్ట్ కార్డులతో రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత – MLA చంద్రమోహన్ రెడ్డి

Author Icon By Shravan
Updated: August 26, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముత్తుకూరు (నెల్లూరు) : ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల (Smart ration cards) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారన్నారు. సరుకులు పొందిన, పొందని వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్గా కనిపించేలా క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోపాలను సరిదిద్దేందుకు ఈ స్మార్ట్ కార్డులు దోహదం చేస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సౌకర్యవంతంగా అనేక మార్పులు తీసుకొస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరుకులు అంటూ కోట్ల రూపాయలు వచ్చిన ఖర్చుపెట్టి వాహనాలను తెచ్చారు.

MLA చంద్రమోహన్ రెడ్డి

రేషన్ పంపిణీలో కొత్త మార్పులు

వాహనాలు సమయంలోనే రేషన్ సరుకులు తీసుకోవాలని, అవి కూడా ఇంటి వద్దకు రావు వీధిలో ఎక్కడో ఒక చోట నిలుపుతారన్నారు. వాహనాలు వచ్చిన గంటలో రేషన్ సరుకులు తీసుకోకపోతే ఇక ఆ నెలలో కట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో పాత విధానాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్దిదారులు ఏ రోజైనా రేషన్ షాపుకి వెళ్లి సరుకులు పొందవచ్చు65 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు నేరుగా ఇళ్ల వద్దకే సరుకులే ఇచ్చే ఏర్పాటు చేసింది. ఒకటో తేదీకి ఐదు రోజుల ముందే వారికి సరుకులు అందజేస్తున్నారు. మొదట రేషన్ కార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందే తెలుగుదేశం పార్టీ అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ప్రయోజనాల కన్నా పాలకుల ఫొటోలకే ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం కేవలం లబ్ధిదారుల ఫొటోలతోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షులు పల్లారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈదురు రామ్ ప్రదీప్ కలిసేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/bjp-congress-spreading-false-propaganda-on-urea-in-the-state/hyderabad/536422/

Andhra Pradesh News Breaking News in Telugu Chandramohan Reddy Latest News in Telugu ration distribution smart cards Smart Ration Cards Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.