నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం ప్రయాణికులకు క్షణికంగా ప్రాణభయాన్ని కలిగించిన ఘటన చోటుచేసుకుంది. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్ (12670) రైలులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలు, పొగలతో పరుగులు తీయిన ప్రయాణికులు
మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు (Cherlopalli Gate) సమీపంలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో, ఇంజిన్ వెనుక భాగంలోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ప్రయాణికులు అప్రమత్తమై, ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే పలువురు ప్రయాణికులు వెంటనే రైలు దిగి భయంతో పరుగు తీశారు.
సాంకేతిక లోపమే కారణం
రైల్వే సిబ్బంది వివరాల ప్రకారం, బ్రేక్ బైండింగ్ (Brake binding) సమస్య కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే వారు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. అవసరమైన మరమ్మతులు చేసి, సుమారు అరగంట తర్వాత రైలును తిరిగి ప్రయాణానికి అనుమతించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: