📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Simhadri Appanna : సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం

Author Icon By Sudheer
Updated: April 30, 2025 • 7:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి, ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.

హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి కారణంగా, ఇటీవల నిర్మించిన గోడ నాణ్యత లోపంతో పాటు, వర్షానికి మట్టి నానిపోవడం వల్ల గోడపై ఒత్తిడి పెరిగి కూలిపోయినట్టు అధికారులు తెలిపారు .​

బాధ్యులపై చర్యలు

ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణమైన నిర్మాణ లోపాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింహాచలం ఆలయంలో భక్తుల భద్రతకు మరింత శ్రద్ధ తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు .​

Read Also : India -Pakistan War : ఆర్మీకి మోడీ పూర్తి స్వేచ్ఛ..వార్ కు సిద్దమైనట్లే !!

9 devotees killing Ap Google News in Telugu Simhadri Appanna Swamy Temple Incident wall collapsed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.