📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Tourism : డిజిటల్ మీడియాలో పర్యాటక ప్రాంతాల విస్తృత ప్రచారం

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tourism : రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక, వారసత్వ సందకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాల వైపు పర్యాటకులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేక తలపై వేర్వేరుగా రూపొందించి వీడియోలతో ప్రచారం చేస్తోంది. వీటిని అందరూ లైక్, షేర్ చేసిమన ప్రాంతాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఏపీటీడీసీ ఒక ప్రకటనలో కోరింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన కలంకారీ ప్రత్యేకతను వివరిస్తూ రూపొందించిన వీడియోలో సహజ రంగులతో కూడిన అద్దకం, భారతీయ హస్తకళల్లో ప్రాచీన మైన కలంకారీ చిత్రకళను, కళాకారుల నేపుణ్యాన్ని వివరించింది. బాపట్ల జిల్లా లోని భట్రిప్రోలు బౌద్ధస్తూపం నిర్మాణం క్రీ.పూ.3వ శతాబ్దంలో జరిగిందని తెలుగులో లభ్యమైన తొలి శాసనబంగా ఇక్కడి శాసనాలకు పేరుందని మరో వీడియోలో పేర్కొంది. అలనాడు వాణిజ్య, విద్యా కేంద్రంగా విరాజిల్లిన భట్టిప్రోలను సందర్శిం చాలని కోరింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయస్థాయిలో పేరున్న మంగళగిరి చేనేత, ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల గొప్పతనాన్ని… పానకాల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ ప్రాశస్త్యాన్ని వీడియోలో వివరించింది. చీరల అల్లిక, నిజాం డిజైన్ బోర్డర్, నాణ్యమైన రంగుల అద్దకం తదితర అంశాలు ఇందులో పొందుపర్చింది.

ఇక్కడి చేనేతకు జాతీయస్థాయిలో భౌగోళిక గుర్తింపు (GI) దక్కిందని పేర్కొంది. మానవ కృషి, కళానై పుణ్యం కలిసి తయారయ్యే ఈ చీరలు వస్త్రాలు మాత్రమే కావని, జాపకాలు, భావోద్వేగానికి ప్రతీకలని పేర్కొంది గుంటూరు జిల్లా ఉండల్లి గుహల గొప్పతనం వివరిస్తూ ఉండవల్లిలో ఉల్లితో చెక్కిన గుహలను తప్పక సందర్శిం చాలని పర్యాటకులను మరో వీడి యోలో ఆహ్వానించింది. విజయవాడ సమీపం లోని ఈ ప్రాంతంలో విష్ణుకుండినుల కాలానికి చెందిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలతో పాటు 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణని పేర్కొంది. జాతీయ ప్రాముఖ్యత కల్గిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాల్లో ఒకటని ఏపీటీడీసీ తెలిపింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/terrorism-strict-action-against-supporters-of-terrorism/andhra-pradesh/531758/

Breaking News in Telugu Digital Media Campaign Latest News in Telugu Telugu News Paper Tourism Awareness Program Tourism in Andhra Pradesh Tourism News India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.