📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

BJP Tour : సారథ్యం పేరుతో రాష్ట్రంలో పర్యటన – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

Author Icon By Shravan
Updated: August 14, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BJP Tour : పార్టీ బలోపేతం కోసం సారథ్యం పేరుతో రాష్ట్రమంతటా పర్యటించి నిస్తేజంగా ఉన్న పార్టీని పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్. మాధవ్ పేర్కొన్నారు. నెల్లూరులోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సారధ్యంలో భాగంగా బిజెపి పార్టీ (BJP Party) నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నానని పివిఎన్. మాధవ్ తెలిపారు. గత నెల 27వ తారీకున కడప నుంచి ప్రారంభమై అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ నెల్లూరు జిల్లాకు రావడం జరిగిందన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో పార్టీకి వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. తన పర్యటనలో ప్రముఖ వ్యక్తుల్ని కలవడం, ప్రధాన సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం, ఆయా ప్రాంతాల్లో ఉన్న మహానుభావుల గురించి పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తూ, పార్టీ క్యాడర్ ప్రేరణ పొందేలా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఎక్కడికెళ్లినా పార్టీ కార్యకర్తల్లో, నాయకత్వంలో మంచి స్పందన లభిస్తోందని అన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలవడం శుభపరిణామం అని, 460 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమ రాష్ట్రానికి గేమ్ చ్నేజర్ కాబోతుందని వివరించారు. రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం మంచి శుభపరిణామం అన్నారు.

తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ, భోగాపురం, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు 1,84,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ, విశాఖలో ఆదానీ డేటా సెంటర్, మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో గుజరాత్ ను దాటి మన రాష్ట్రం అభివృద్ధిని సాధించబోతుందన్నారు. అంతే కాకుండా దుబాయ్ లో సక్సెస్ అయిన లూ లూ కంపెనీ ద్వారా మెగా మాల్స్, ఇంటర్నేషనల్ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు వస్తాయని వివరించారు. కూటమి ప్రభుత్వంలో మీర్నుడి నామినేటెడ్ పదవుల్లో మీ పార్టీకి ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, నామినేటెడ్ పదవుల్లో మా పార్టీనే జనసేన పార్టీ, టిడిపి పార్టీలో కూడా కొంత అసంతృప్తి ఉందని వాటన్నిటిని సరి చేసేందుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి సురేష్ రెడ్డికి, తెలుగు సంస్కృతి భాషల పరిరక్షణ చైర్మన్గా ఆర్డీ విల్సన్ కు పదవులు రావడం మంచి పరిణామం అన్నారు. పార్టీలో కార్యకర్తలకు (Party workers) నాయకత్వ లక్షణాలు పెంపొందించి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కార్యకర్తల్లో చైతన్యం తీసుకొస్తున్నామని చెప్పారు. నెల్లూరు ఎయిర్పోర్ట్ విషయంలో కొంత జాప్యం జరుగుతుందని దీనిపై కూడా అధినాయకత్వంతో చర్చిస్తామని చెప్పారు. రాబోయే పరిశ్రమలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 128 దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. కొండ బిట్రగుంట అంతర్వేదిలో గత ప్రభుత్వంలో రధాలు తగలబెట్టినా ఎలాంటి విచారణ చేపట్టకుండా చిన్నచిన్న కారణాలతో జరిగాయి అంటూ, కేసులు మూసి వేయడం జరిగిందన్నారు. వీటిని సహించబోమని హిందూ దేవాలయాల పైన దేవుళ్ళ పైన దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, కర్నాటి ఆంజనేయ రెడ్డి, గుండ్లపల్లి భరత్ కుమార్, వంశీధర్ రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, దయాకర్ రెడ్డి, విజయలక్ష్మి, సురేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/huge-amount-of-marijuana-and-chocolates-seized-through-railways/andhra-pradesh/530080/

BJP AP politics BJP tour Breaking News in Telugu Latest News in Telugu Madhav BJP president political tour Andhra Pradesh Sarathyam program Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.