Eggs Price : గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర

Read Time:  1 min
Eggs Price : గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. కేవలం రెండు నెలల క్రితం వరకు వంద గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 695 పలకగా, ప్రస్తుతం అది రూ.480కి పడిపోయింది. అంటే ఒక్కో గుడ్డుపై దాదాపు రెండు రూపాయలకు పైగా ధర తగ్గింది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి తమకు రూ.5.50 వరకు ఖర్చవుతోందని, కానీ మార్కెట్లో అంతకంటే తక్కువ ధర పలుకుతుండటంతో భారీగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన దాణా ధరలు, నిర్వహణ వ్యయం ఒకవైపు.. పడిపోతున్న అమ్మకం ధర మరోవైపు పౌల్ట్రీ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.

Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

ఈ ధరల పతనానికి ప్రధాన కారణం ఎగుమతులు నిలిచిపోవడమేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే గుడ్లకు ప్రధాన మార్కెట్ అయిన కోల్‌కతాలో ప్రస్తుతం డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అక్కడి ట్రేడర్లు సిండికేట్‌గా మారి కేవలం రూ.437కే వంద గుడ్లు అడుగుతుండటంతో రైతులు బేరమాడలేక ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు రోజులుగా రవాణా సౌకర్యాలు కూడా సరిగ్గా లేకపోవడంతో, ఫారాల్లోనే లక్షలాది గుడ్లు పేరుకుపోయాయి. గుడ్లు త్వరగా పాడయ్యే వస్తువు కావడంతో, నిల్వ ఉంచే కొద్దీ నాణ్యత తగ్గి మరింత తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించడంతో పాటు, కోల్‌కతా వంటి ఇతర రాష్ట్రాల మార్కెట్లతో సమన్వయం చేసుకోవాలని కోరుతున్నారు. పౌల్ట్రీ రైతులకు విద్యుత్ రాయితీలు మరియు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కలేమని వారు స్పష్టం చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక కోళ్ల ఫారాలు మూతపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.