📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tollywood: సినీ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర

Author Icon By Aanusha
Updated: January 10, 2026 • 6:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నిర్మాత బండ్ల గణేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కును తీర్చుకునేందుకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈనెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి కాలినడకన తిరుమల వరకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన త్వరగా విడుదలై మళ్లీ సీఎం కావాలని బండ్ల గణేష్ మొక్కుకున్నారు.

Read also: Anaganaga Oka Raju: ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు

Tollywood: Film producer Bandla Ganesh’s great foot march

తిరుమల పాదయాత్ర

ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కును తీర్చుకునే క్రమంలో ఈ యాత్ర చేపడుతున్నారు.కాంగ్రెస్ తరఫున తెలంగాణలో క్రియాశీల రాజకీయాలు చేస్తున్న బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తిరుమల పాదయాత్ర చేస్తుండటం విశేషంగా చెబుతున్నారు.2023లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారు.

56 రోజుల పాటు జైలులో నిర్బంధించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక బండ్ల గణేష్ అప్పట్లో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.చంద్రబాబు క్షేమంగా విడుదలైతే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ అప్పట్లో మొక్కుకున్నారు. చంద్రబాబు విడుదలై ఏపీలో రికార్డు స్థాయి విజయం సాధించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా 19 నెలలుగా పాలిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bandla Ganesh Chandrababu Naidu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.