సామాజిక రుగ్మతలను రూపుమాపడానికైనా, భయంకరమైన అనారోగ్యకర అలవాట్లను అదుపులో పెట్టేందుకైనా పన్నులు భారమో, జరిమానాల విధింపులతోనో కళ్లెం వేయడం సాధ్య మౌతుందని నమ్ముతుంటాం. ఎటూ కక్కలేక మింగలేక అలవాట్లకు దూరంగా ఉంటారని భావిస్తుంటాము. నిన్న మొన్నటి వరకు ఒక పక్క పొగాకు త్రాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటూనే, పొగాకును విరివిగా పండించే ప్రాంతాల్లోని రైతుల ఉత్పత్తుల రవాణాకు అన్ని సౌకర్యాలను సమకూర్చిపెట్టడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో దేశం లో కేన్సర్, గుండె, ఊపిరితిత్తుల రోగాల కారణంగా ఏటా 1.35 మిలియన్ మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు పండించే రైతులను ప్రత్యే కించి నిరుత్సాహపరచకుండా, అలాఅని ప్రత్యేక ప్రోత్సా హకాలు లేకుండా రైతులు వారంతటవారే ఇతర పంటలకు మారేపరిస్థితి తీసుకురావాలన్నది ప్రభుత్వఆలోచన. ఇలా పొగాకు
సాగులో ప్రభుత్వాలు ఎటూ పాలుపోని పరిస్థితులో సతమతమౌతుంటాయి. ఆ నేపథ్యమే 2018 నుంచి 2022 మధ్య 112లక్షల ఎకరాలకుపైగాభూమిలో పొగాకు (tobacco) సాగు నుండి రైతులు ఇతర పంటలకు మారేలా చేసింది. అందులో భాగంగానే కర్ర విరగకుండా, పాము చావకుండా అన్న ధోరణిలో ప్రభుత్వం పన్ను విధానాల రూపకల్పన చేస్తూ వస్తోంది. కారణాలు ఏవైనా ప్రభుత్వ సంకల్పం మేరకు ప్రజల అనారోగ్యానికి హేతువయ్యే పొగాకు (tobacco)ఉత్పత్తులు పెరగకుండా చూడగలుగుతోంది. దేశంలో పొగాకుపై 60 లక్షల మంది రైతులు రెండు కోట్ల మంది కూలీలు ఆధారపడుతుంటారు. కానీ తాజా గా కేంద్రప్రభుత్వం పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ (సవ రణ) బిల్లు 2020 – 25ను మూజువాణి ఓటుతో లోక్ సభలో ఆమోదించింది. సిగరెట్లు, చుట్టలు, హుక్కా, జర్దా నమిలే పొగాకుపై ప్రస్తుతమున్న జిఎస్టీ 28 శాతంతో పాటు పలు విధాలైన సెస్సు ఉంది. ముడి పొగాకుపై 60-70 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సెస్సు సిగరెట్లు, చుట్టలపై 25 శాతం వరకు ఉంటుంది. కాదంటే ప్రతి వెయ్యి చుట్టలకు రూ.5వేలు చొప్పున డ్యూటీ చెల్లించాలి. ఫిల్టర్ సిగరెట్లకు ప్రతి వెయ్యికి రూ. 2700 నుంచి 11 వేల వరకు సుంకం విధించమన్నారు. నమిలే పొగాకుకు మాత్రం కిలోకి 100
రూపాయలుగా నిర్ణయించారు. పరిహార సెస్సుకు ఈ పెంచిన సుంకాలకూ ముడిపెట్టారు. పరిహార సెస్సు పూర్త య్యాకనే కొత్త సెస్సు మొదలవుతుంది. కోవిడ్ సమయం లో తగ్గిపోయిన ఆదాయ భర్తీకి రాష్ట్రాలు తీసుకున్న రుణాలు తీరిపోయాక పరిహార సెస్సుకు బదులుగా కొత్త విధానంలో సెస్సు వసూలు తప్పదు. తమకు వచ్చే ఆదా యంలో 41 శాతాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ ఇది. గరిష్టంగా 40 శాతం చొప్పున జిఎస్టీ విధానం కొనసాగుతుంది. పొగాకు మీద హెచ్చుపన్నుల ద్వారా పొగాకు వాడకం తగ్గించగలిగితే ఒక విధంగా మంచిదే. పరిహార సెస్సు కాలపరి మితి పూర్తయినందున కొత్త సెస్సులు వడ్డించారా? లేదా పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించడం ద్వారా జనా నికి ఆరోగ్యకర అలవాట్లు వస్తాయని పొగ తాగకుండా చూడాలన్న దృక్పథంతోనే మరో రూపంలో ఈ సెస్సును భర్తీ చేశారన్నది సుస్పష్టం. ఏదిఏమైనా పొగాకు విరివిగా పండించే ప్రాంతాల్లోని లోక్సభ సభ్యులు పన్నుల్లో మా ర్పులు చేసేటప్పుడు రైతుల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. అదే సమయంలో ప్రజారోగ్యం కోసం తీసుకునే నిర్ణయాలను రైతులు సుముఖత వ్యక్తం చేశారని భరోసా ఇవ్వడం విశేషం. పొగాకు సాగును పూర్తిగా రద్దు చేయలేని పరిస్థితుల్లో తగ్గించడానికే ప్రభు త్వాలు కృషి చేస్తుంటాయి. తాజాగా వేసిన సుంకంకూడా ఆ కోవలోకే వస్తుంది. దాంతో ఇక ఆ పన్ను వసూలు చేయాల్సిన ఆవశ్యకత కేంద్రానికి లేకపోయింది. అలా అని ఆ పన్ను వసూలు ఆపేస్తే పొగాకు ఉత్పత్తుల ధరలు బాగా తగ్గిపోతాయి. ఇలాంటి పరిస్థితులు సదరు పన్ను తగ్గితే పొగాకు ఉత్పత్తుల అధిక వినియోగానికి దారి తీస్తుంది. ఒకపక్క పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరో గ్యానికి హానికరం అంటూనే ఆ ఉత్పత్తులకు ధర తగ్గే పరిస్థితి కల్పిస్తే వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తగ్గిన సుంకాన్ని మరో రూపంలో పెంచేందుకు కేంద్రం ఉపక్రమించింది. ఇది సెస్సు కాదని, కేవలం ఎక్సైజ్ సుంకమేనని అది కూడా పొగాకు ఉత్ప త్తుల ధరల పెంపు వలన వినియోగం ఎప్పటిలానే ఉం టుందని ఆర్థిక మంత్రి అభిపాయం. అందుకే ఈ ప్రతి పాదన జరిగింది. ఒకపక్క పొగాకు రైతుకు ప్రోత్సాహం మరోపక్క వినియోగదారుని ఆరోగ్యరక్షణ వీటి విషయం లో సమతుల్యత పాటించడానికే ఈ పన్ను విధానం నిర్ణ యింపబడింది. కొత్తగా వేసిన పన్ను బీడీల ధరను పెంచు తుంది. దానివలన వినియోగం తగ్గి పరోక్షంగా దేశంలోని లక్షలాది మంది బీడీ కార్మికులు ఉపాధి కోల్పోతారని ఎంపీలు ఆవేదన వెలిబుచ్చారు. జాతీయ వ్యవసాయ అభివృద్ధి పథకం కింద పంట వైవిధ్యీకరణ కార్యక్రమం కింద 2015 నుండి దేశంలోని పది రాష్ట్రాలు పొగాకు పండించి ఉత్పత్తి చేస్తున్నాయి. పాన్ మసాలా తయారీ యూనిట్లపై కూడా సెస్వి ధించారు. ఈ విధంగా వసూలు అయ్యే మొత్తం జాతీయ భద్రత కోసమే వినియోగించేందుకు నిర్ణయం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: