📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Tirupati: తొక్కిసలాట ఘటన నివేదిక బుట్టదాఖలేనా?

Author Icon By Rajitha
Updated: February 6, 2026 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలకు సామాన్య భక్తులను అనుమతించడంలో నిర్దేశిత టైమ్ స్లాట్ టోకెన్ జారీకి ముందే 2025 జనవరిలో తిరుపతిలో (Tirupati) చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విశ్రాంత జడ్జి దర్యాప్తు నివేదికలు బుట్టదాఖలయ్యాయా అనే ప్రశ్నల చర్చసాగుతూనే ఉంది. ఈ ఘటనలో తొలిరోజుల్లోనే టిటిడిలో కీలక అధికారులను బదలీ చేయడం, చివరకు పోలీసు యంత్రాంగంపై ఆ ప్రభావం చూపింది. గత ఏడాది జనవరి 8వతేదీ టోకెన్లు జారీకి ముందే సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, భద్రత అంతం మాత్రంగానే ఉండటంతో తొక్కిసలాట జరిగిందనే ప్రధాన కారణాలను బాధితులు ఏకంగా సిఎం చంద్రబాబుకు, డిసిఎం పవన్కల్యాణ్కు, చివరకు విచారణ కమిటీ విశ్రాంత న్యాయమూర్తికి వెల్లడించారు.

Read also: TTD Laddu Issue:రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

Will the report on the stampede incident be shelved?

ఏకంగా ఆరుగురు భక్తులు విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్యస్వాతి(37), కంచర్లపాలెంకు చెందిన శాంతి(35), మద్దెలపాలెంకు చెందిన రజని(47), నరసరావుపేట రామచంద్రాపురంకు చెందిన బాబునాయుడు(51), తమిళనాడు సేలం జిల్లా మేదారిగ్రామంకు చెందిన మల్లిగ(50), పొల్లాచ్చికి చెందిన నిర్మల(45) ప్రాణాలు కోల్పోయారు. యాభై మందికి పైగా క్షతగాత్రులైన విషయం తెలిసిందే. ఆ రోజు తిరుపతిలో భక్తుల రద్దీ నియంత్రణలో టిటిడి అధికారులు, పోలీసు అధికారుల అతి విశ్వాసంతోనే విషాద ఘటన జరిగిందనేది చివరకు తేల్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత న్యాయ మూర్తి జస్టీస్ ఎం. సత్యనారాయణమూర్తిని నియమించింది. ఆయన ఏకంగా పది పదకొండునెలలు ఈ ఘటనపై సమగ్రంగా క్షేత్రస్థాయిలో కూడా దర్యాప్తు చేశారు.

వైకుంఠద్వార దర్శనాల్లో జరిగిన విషాదం

చివరకు నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ నుండి విచారణ చేపట్టారు. వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీకి ముందే చోటుచేసుకున్న తొక్కిసలాటకు కారణాలు, అక్కడ భద్రత ఏర్పాట్లుపై సంబంధిత పోలీసు, రెవెన్యూ, టీటీడీ అధికారుల నుండి వివరాలు సేకరించారు. ఘటన జరిగిన బైరాగిపట్టెడ పద్మావతి ఉద్యానవనం, సత్యనారాయణపురం ప్రాంతాల్లో ప్రజలను కలసి వివరాలను రాబట్టారు. ఇదంతా ఒక నివేదిక రూపంలో సమర్పించారు. ఎక్కడికక్కడ పోలీసులు, విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఒక్కసారిగా నిరీక్షణ ప్రాంతం నుండి క్యూలైన్లలోనికి చేరుకునేందుకు తోపులాట, చివరకు తొక్కిసలాట జరిగిందనేది నిర్ధారించారు.

విశ్రాంత న్యాయమూర్తి విచారణలో తేలిన అంశాలు

బైరాగిపట్టెడలో బందోబస్తు 2025 జనవరిలో ఘటనప్పటి తిరుపతి క్రైమ్ డిఎస్పీ రమణకుమార్, పూర్వ టిటిడి గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి సస్పెన్షన్ కమిటీలోని జస్టీస్ సత్యనారాయణమూర్తి పూర్వ టిటిడి ఇఒ, పూర్వ కలెక్టరు. పోలీసు అధికారులను లోతుగా విచారణ చేసి వివరాలు రికార్డు చేశారు. ఆ తరువాత ప్రత్యక్ష సాక్షులు, బాధితుల నుండి కూడా సమాచారం రాబట్టి నివేదికగా తయారుచేశారు. భక్తుల భద్రతలో, రద్దీని నియంత్రించడంలో టిటిడి అధికారులు, బందోబస్తు నిమిత్తం జిల్లావ్యాప్తం నుండి వచ్చిన పోలీసులు, రెవెన్యూ విభాగం. విధుల్లో పూర్తిగా విఫలమైందనేది విచారణ కమిషన్కు అందిన సమాచారం.

నివేదికపై చర్యలు ఎందుకు లేవు?

ఆఫ్లైన్లో టోకెన్లు జారీకి ముందు తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించలేకపోవడమే తొక్కిసలాటకు కారణమని పలువురు బాధితులు విచారణ కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ సత్యనారాయణ మూర్తికి విన్నవించారు. ఈ నివేదిక ఆధారంగా గత ఏడాది ఘటనకు కొందరు సిఐలు, ఎస్ఐలపై చర్యలకు సిఫార్సు చేశారా? లేదా అందులోని ప్రధాన వివరాలపై ఇంతవరకు చర్యలు లేకపోవడం దేనికి సంకేతమనేది రాజకీయవర్గాల్లోనూ చర్చగా మారింది. ఇంతకీ గత ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఎవరెవరి తప్పిదమనేది ఇప్పటికీ తేలని విషయాలు. మటన నివేదికలు ఏమయ్యాయనేది సందిగ్ధతే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Devotees Safety Investigation latest news Stampede Telugu News tirupati TTD Vaikuntha Dwara

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.