Tirupati gold missing : వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురం పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గోపురానికి చేసిన బంగారు తాపడం పనుల్లో సుమారు 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతైన విచారణ ప్రారంభించింది.
ఇప్పటికే తిరుమలలో లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు గోపురం పనుల వ్యవహారం మరింత కలకలం రేపుతోంది. తిరుమల కొండపైనే కాకుండా, కొండ కింద కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని విజిలెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, గోపురం పనుల సమయంలో సుమారు 30 విగ్రహాలు ధ్వంసమైనట్లు కూడా గుర్తించారు.
TG Politics: తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ
అత్యంత ప్రాముఖ్యం కలిగిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 2022–23 (Tirupati gold missing) మధ్యకాలంలో బంగారు తాపడం పనులు చేపట్టారు. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ పనుల కోసం 100 కిలోల బంగారం కేటాయించింది. తొమ్మిది పొరల (9 లేయర్లు)తో తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పనులు పూర్తి చేసి, మిగిలిన బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో గోపురంపై ఉన్న విగ్రహాలను తొలగించి ధ్వంసం చేసిన తర్వాత బంగారు తాపడం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని బయటకు రానీయకుండా అప్పటి టీటీడీ పాలకులు కప్పిపుచ్చారని ఫిర్యాదులు అందాయి. అలాగే గోపురం పనులు అసలు కాంట్రాక్టర్‌కు కాకుండా, సబ్ లీజు పేరుతో ఇతరులకు అప్పగించారన్న అంశం కూడా విచారణలో ఉంది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు అప్పటి ఫిర్యాదుదారులు, కార్మికుల నుంచి వివరాలు సేకరిస్తూ, ఎంత బంగారం వాడారు? ఎన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి? అన్న అంశాలపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :