📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati: హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై మూడు రోజులు శిక్షణ

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati: సెన్సెస్-2027 లో భాగంగా మొదటి విడతలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపట్టడం జరుగుతుందని, పూర్తి డిజిటల్ విధానం లో నిర్వహించే ప్రక్రియ పై మార్చి 03 నుండి 05 వ తేదీ వరకు మూడు రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

మంగళవారం తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ ప్రకాశం భవన్ లో జిల్లాలో నిర్వహించనున్న సెన్సెస్ -2027 లో భాగంగా మొదటి విడతలో నిర్వహించే హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై జిల్లా స్థాయి మరియు సంబంధిత అధికారులకు నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ క్రమంలో జే సి ఆర్. గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ రఘు వాన్సీ, డి ఆర్ ఓ, రాష్ట్ర స్థాయి సెన్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ కే.సుప్రీజ్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: Technology : సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

Tirupati: Three days of training on house listing and house census

డిజిటల్ విధానం

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సెన్సెస్-2027 కార్యక్రమం దాదాపు 15 సం.ల అనంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గానూ సెన్సెస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CMMS) ను రూపొందించిందన్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసి ఉంటుందని. అధికారులు తమ విధిని నిబద్ధత తో నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారని, జాయింట్ కలెక్టర్ అదనపు సెన్సెస్ అధికారిగా, డి ఆర్ ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా ఉంటారన్నారు.

ఫీల్డ్ లెవల్ శిక్షణ

కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యహరిస్తారన్నారు. మండల స్థాయిలో సూపర్వైజర్ లు, ఎన్యూమరేటర్లు ఉంటారన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బంది ఎప్పటికప్పుడు తమ పై అధికారుల సూచనలను పాటించవలసి ఉంటుందన్నారు. శిక్షణా తరగతులలో భాగంగా మెటీరియల్ ను అందించడం జరుగుతుందన్నారు. మెటీరియల్ చదివి పూర్తి అవగాహనతో ఎన్యూమరేటర్లకు వివరించాలన్నారు. జిల్లాలో సెన్సెస్ కార్యక్రమం ను రాష్ట్ర స్థాయి నుండి ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షించడం జరిగిందన్నారు. మాస్టర్ ట్రైనర్ లను త్వరలో ఎంపిక చేసి ఫీల్డ్ ట్రైనర్ లకు శిక్షణ ఇస్తారని, ఫీల్డ్ ట్రైనర్ లు మండల, మున్సిపల్ పరిధిలో ఛార్జ్ ఆఫీసర్ లకు, సూపర్వైజర్ లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. డిజిటల్ విధానంలో నిర్వహించే ప్రక్రియను నిర్దేశించిన విధానంలో తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Census 2027 India digital census House listing and house census training Tirupati District Collector

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.