📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Tirupati: శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

Author Icon By Pooja
Updated: March 14, 2026 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati: భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన… పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి తరంగాలతో మేల్కొంటోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం నగరమంతా విరజిల్లాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి సభ్యులు ఘనంగా నగర సంకీర్తనను నిర్వహిస్తున్నారు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజు వందలాది మంది భక్తులు పాల్గొంటూ తిరుపతి వీధులను గోవింద నామస్మరణతో మారుమోగిస్తున్నారు.

Read Also :Tirumala: శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

Tirupati

భక్తుల గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ

శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజా స్వామి గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. “గోవింద… గోవింద…” అనే నామస్మరణతో మారుమోగే వీధులు తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు.ఈ నగర సంకీర్తన ద్వారా ప్రతి ఇంటిలోనూ భక్తి భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంకీర్తన ముగిసిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగిస్తున్నారు.ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు నాగేశ్వర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, కోటి మునికృష్ణ మునెప్ప గారి మునినాథరెడ్డి , నాగరాజు, వాసుదేవ రెడ్డి, పద్మనాభం, నరసింహారెడ్డి, ధనంజయ రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, మిట్టపల్లి బ్రహ్మానందం, మురళి, తొండమునాటి సుబ్రహ్మణ్యం, మధు, కన్నప్ప గారి కేశవులు, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, ఉష, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, కల్పన విగ్రహాల కళ్యాణి సిద్ధమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.భక్తి, ఐక్యత, సేవా భావాల సమ్మేళనంగా కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి నగర ఆధ్యాత్మిక మహిమను మరింతగా చాటుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.