తిరుమల(Tirupati) బైపాస్ రోడ్డులోని కొర్లగుంట కూడలిలో డివైడర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం తొలగించారు. కొర్లగుంటవాసులు డివైడర్ కారణంగా రాకపోకలకు తాము ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగిన జనవాణి కార్యక్రమంలో కూడా కొర్లగుంట వాసులు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం కొర్లగుంట కూడలిని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. డివైడర్ కారణంగా తాము లీలామహల్ సర్కిల్ లో యూటర్న్ చేసుకు రావాల్సి వస్తున్నదని దీనితో స్కూల్ కు వెళ్ళే విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్ళే వారు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే కి స్థానికులు తెలిపారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొర్లగుంట స్కరిల్ డివైడర్ ను తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.
Read Also: Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్ అధ్యక్షుడు
దీనిపై కొర్లగుంట, మారుతీనగర్ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. కూడలిలో స్పీడ్ బ్రేకర్స్ సోమవారం రాత్రికి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు(Tirupati) చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, ఎం.రఘురామ్ , గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ మహేష్ యాదవ్, కార్పొరేటర్ దూది కుమారి , గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యులు గుణ, రుద్ర కిషోర్, చంద్ర, జగదీష్, రాజేష్, మస్తాన్ నాయుడు,బ్యాంక్ శాంతమ్మ, మునస్వామి యాదవ్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆళ్వార్ మురళీ, శిరీషా, సుధాకర్, పురుషోత్తం, దూది శివ, ధరణి, సాయి కుమార్, ఆముదాల వెంకటేష్, కొండా రాజమోహన్, అనిల్, నవీన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: