Tirupati : తిరుపతి కేంద్రంగా ఆధ్యాత్మిక కారిడార్ – బిజెపి రాష్ట్ర చీఫ్ మాధవ్ కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలుచేస్తున్న సంక్షేమపథకాల స్పూర్తితో ఎపిలో బిజెపిని సంస్థాగతంగా బలపరచడానికి ఒక రోడ్మ్యాప్ రూపొందిస్తు న్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీకోసం పనిచేస్తున్న కార్యకర్తల శ్రమ వృధాకానివ్వబోనని భరోసా నిచ్చారు. రాష్ట్రరాజధాని అమరావతిని స్మార్ట్ సిటీ పథకం (Smart City Scheme) క్రింద అభివృద్ధి చేయడానికి, అమలుకు కేంద్రప్రభుత్వం అనుమతిమంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికనగరం తిరు పతిని కేంద్రాంగా చేసుకుని ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థా నంలో అన్యమత ఉద్యోగులను ఇతర శాఖలకు బదలీ చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర బిజెపి చీఫ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మంగళవారం ఉదయం సారధ్యం (Leadership) కార్యక్రమంలో పాల్గొనేందుకు మాధవ్ తిరుపతికి చేరుకున్నారు. ఉదయం ఆయన నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న బాబూ జగజ్జీవన్రామ్ ఉద్యానవనం వద్దకు వచ్చారు. ఆయనకు బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, మాజీ ఎంపి డాక్టర్ వరప్ర సాద్, బిజెపి నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాధరెడ్డి, కోలా ఆనంద్, మునిసుబ్రమణ్యం, సైకం జయచంద్రారెడ్డి, పృధ్వీరెడ్డి, వరప్రసాద్, పొనగంటి భాస్కర్, గాలిపుష్పలత, సింగంశెట్టి సుబ్బరామయ్య, పిసి రాయల్, రాటకొండ విశ్వనాధ్, అక్కినపల్లి మునికృష్ణయ్య తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన లీలామహల్ కూడలికి చేరుకున్నారు. అక్కడ కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసిపుష్పాంజలి ఘటించారు. అక్కడ నుండి నగరవీధుల్లో భారీప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కచ్చపి ఆడిటోరియంలో జరిగిన సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాధవ్ మాట్లాడారు. తిరుపతిని పూర్తిస్థాయిలో కేంద్రం 100 కోట్ల రూపాయలు స్మార్ట్సిటీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :