- Tirupati Rajanna Park: కన్వెన్షన్ చైర్మన్, వాకర్స్ ఇంటర్నేషనల్ మంగళవారం ఉదయం 11 గంటలకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ .మౌర్య ని కలసి మెటర్నటి హాస్పిటల్ రోడ్డు లోని రాజన్న పార్కులో వాకింగ్ ట్రాక్ , యోగ సాధనశాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
- దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ప్రజల ఆరోగ్య దృష్ట్యా వాకింగ్ ట్రాకును తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా కమీషనర్ మౌర్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతి నడిబొడ్డున ఉన్న మేటర్నిటీ హాస్పిటల్ రోడ్డు నందు గల రాజన్న పార్కు నందు ప్రస్తుతం సాయంత్రం పూట మాత్రమే చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనుమతులు ఇస్తున్నారనీ వాకింగ్ ట్రాక్ లేనందువల్ల పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు ఖాళీగా సమయం వృధా అవుతున్నందున వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినచో వాకింగ్ చేస్తూ పిల్లలను ఆటలాడిస్తూ మరియు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని దృఢం చేసుకునేందుకు వాకింగ్ ట్రాకులు ఉపయోగపడతాయని తెలిపారు.
- తమ వినతిని కమిషనర్ మౌర్య అనుకూలంగా స్పందిస్తూ తప్పక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కమిషనర్ మౌర్య కి తిరుపతి వాకర్స్ అసోసియేషన్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, రామమూర్తి, ఈశ్వర్ రెడ్డి, శాంతి,శేషాద్రి,వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: