Tirupati Police: ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

Read Time:  1 min
Tirupati Police
Tirupati Police
FONT SIZE
GET APP
  • Tirupati Police: వజ్రపహార్ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు – అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు “వజ్రపహార్” ఆపరేషన్ సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO), నాకాబందీ మరియు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.
  • ఈ కార్యక్రమాలలో అనుమానితులు, రౌడీషీటర్లు, గంజాయి రవాణా, సైబర్ నేరాలు మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.
  • గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ప్రాంతంలో రెనిగుంట సబ్ డివిజన్ ఎస్‌డిపిఓ నాయకత్వంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో పోలీసులు సమావేశమై గంజాయి వ్యతిరేక ప్రచారం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు మరియు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
  • సూల్లూరుపేట సిఐ ఆధ్వర్యంలో తడ, డి.వి. సత్రం, ఓజిలి మరియు సూల్లూరుపేట పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు మరియు సిబ్బంది మన్నారపోలూరు గ్రామంలో CASO నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సూల్లూరుపేట రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ సమీపంలోని దుకాణాలను NDPS సంబంధిత అనుమానాస్పద కార్యకలాపాల కోసం తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఒక దొంగిలించిన మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
  • నాయుడుపేట శ్రీకాళహస్తి రోడ్డుపై పోలీసులు విజిబుల్ పోలీసింగ్ మరియు ట్రాఫిక్ క్లియరెన్స్ విధులు నిర్వహించి వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
  • అలాగే తిరుమల సబ్ డివిజన్ పరిధిలోని పాపవినాశనం ప్రాంతంలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్, ఫైర్, బీడీ టీం, హెల్త్ డిపార్ట్‌మెంట్లకు చెందిన సుమారు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు.
  • ఇక ఆటో నగర్ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం 32 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి రవాణాదారులు, రౌడీషీటర్లు, అనుమానితులు మరియు శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
  • ఈరోజు శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ పోలీసులు తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనాధపాలెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎస్‌డిపిఓ నాయకత్వంలో సబ్‌డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించి ప్రజలతో మాట్లాడి గంజాయి వాడకంతో కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించారు.
  • అలాగే గంజాయి వినియోగాన్ని నిరోధించేందుకు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి యువతను మరియు గ్రామ ప్రజలను గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో బి.ఎన్. కండ్రిగ సీఐ , శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
  • కోడూరు అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ల ఎస్సైలు మరియు సిబ్బందితో కలిసి కోడూరు పట్టణంలోని పంచాయతీ కాలనీ మరియు ధర్మపురం ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
  • జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అలాగే ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Tirupati Police

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.