Tirupati Police Gramasabha: గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు

Read Time:  1 min
Tirupati Police Gramasabha: గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు
FONT SIZE
GET APP

Tirupati Police Gramasabha: తిరుపతి జిల్లా (Tirupati) ఎస్పీ లంకెల సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో గ్రామసభలను నిర్వహిస్తూ ప్రజలకు సమగ్ర అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలు, మోసాలు, సైబర్ క్రైమ్ ఘటనలు, ఆన్‌లైన్ గేమ్స్ ప్రభావం తదితర అంశాలపై పోలీసులు గ్రామస్తులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.

Read Also: APInterExams: ఓపెన్ స్కూల్ ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల

Tirupati Police Gramasabha: గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు
Tirupati Police Gramasabha: Police night gatherings in villages

నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్‌పై విస్తృత అవగాహన

సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి ఘటనల గురించి వివరించారు. సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాల్సిన విధానం, సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలను తెలియజేశారు. మహిళలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. గ్రామ పరిధిలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం జరుగుతున్నదేమో అనే అంశంపై గ్రామస్తులను నేరుగా విచారించారు అలాంటి సమాచారం ఉన్నచో పోలీసులకు లేదా డైల్ 112 కి తెలియ జేయాలనీ కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.