📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati: మంచు విష్ణుకు నోటీసులు?

Author Icon By Anusha
Updated: February 8, 2026 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి (Tirupati) లోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో చోటుచేసుకున్న విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Read Also: Meenakshi Chowdhury: కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?

Tirupati: Notices to Manchu Vishnu?

కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు

ఇటీవల MBUలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేయగా, SFI నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు, విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ను ఏ1గా, విష్ణును ఏ2గా, మోహన్ బాబును ఏ3గా పేర్కొన్నారు. ఇప్పటికే PROతో పాటు పలువురు బౌన్సర్లను అరెస్టు చేశారు.

కిడ్నాప్ వ్యవహారంపై  తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయటపెడితే కిడ్నాప్‌ చేస్తారా.. మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Manchu Vishnu police notice Mohan Babu University case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.